లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

గడ్డకట్టే చలిలో..ఐస్ ‌వాటర్‌తో స్నానం : స్కూల్ పిల్లలకు వ్యాయామం

Published

on

siberian school children icy water bath : ఈరోజు స్కూళ్లలో వ్యాయామం అనేదే లేదు. ఆటలనే మాటే ఉండటంలేదు. చదువుకునే పిల్లలకు ఒత్తిడి లేకుండా ఉండాలంటే వ్యాయామం ఉండాలి. ఒత్తిడి లేని చదువుల కోసం వ్యాయామం తప్పనిచేయాల్సిన అవసరం చాలానే ఉంది. వ్యాయామం అంటే ఆటలాడిస్తారు. డ్రిల్ చేయిస్తారు.కానీ వ్యాయామంలో భాగంగా ఓ స్కూల్ పిల్లలతో ‘ఐస్ వాటర్’తో వ్యాయమం చేయిస్తున్నారు. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రష్యాలోని సైబీరియా ప్రాంతమంటే మంచు వర్షంలా కురిసే ప్రాంతం. ఎటు చూసినా హిమప్రాంతమే కనిపిస్తుంది. అటువంటి మంచు కురిసే సైబీరియాలోని ఓ స్కూల్లో విద్యార్ధులతో ఐస్ వాటర్ తో స్నానం చేయిస్తున్నారు. సైబీరియన్ కిండర్ గార్టెన్ స్కూల్ విద్యార్థులందరూ ప్రతిరోజూ ఉదయం తప్పకుండా ఒక బకెట్ ఐస్ వాటర్‌తో స్నానం చేయాలి.

మంచు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు వేడి ఆవిరితో చేసే సానా బాత్ తరువాత, 25 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఇలా చన్నీటి స్నానం చేయాలట. ఇలా విద్యార్ధులు ఐస్ వాటర్ తో స్నానం చేస్తున్న ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

ఇలా ప్రతీరోజు ఐస్ వాటర్ తో స్నానం చేసే వ్యాయామం పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని స్కూలు యాజమాన్యంతో పాటు ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌ అధికారులు చెబుతున్నారు. ఐస్ వాటర్ స్నానం వల్ల విద్యార్థులు ఇన్ఫెక్షన్లు రావని స్థానికులు నమ్ముతారు. దీంతోపాటు చలికి తట్టుకునేలా శ్వాస సంబంధ వ్యాయామాలు కూడా విద్యార్ధులకు నేర్పిస్తారు.

పిల్లలు ఇళ్లలో సానా బాత్ చేసి వచ్చాక..చల్లటి నీటితో స్నానం చేయాల్సి ఉంటుందని స్థానిక ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌ అధికారులు తెలిపారు. ఈ సంప్రదాయ చన్నీటి స్నానం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెబతున్నారు. దీనిపై స్థానిక డాక్టర్లు మాట్లాడుతూ..‘‘వాతావరణం మారుతున్న సమయాల్లో పిల్లలు ఫ్లూ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని..ప్రస్తుతం ఇక్కడ మంచు కురుస్తోంది. ఇలాంటి వాతావరణాన్ని తట్టుకునేందుకు కొత్తరకం వ్యాయామాలు చేయాలి. అప్పుడే పిల్లలు మరింత చురుకుగా, తెలివిగా ఉంటారని తెలిపారు.

స్కూల్ విద్యార్ధులందరూ ప్రతి ఉదయం ఐస్ వాటర్‌తో స్నానం చేయాల్సి ఉంటుంది. కానీ..పిల్లలు అలాచేయాలని మేం ఎవ్వరినీ బలవంతం చేయం వారికి ఇష్టమైతేనే చేయిస్తాం అని ప్రీ స్కూల్ టీచర్, స్విమ్మింగ్ కోచ్ ఒక్సానా కబోట్కో తెలిపారు.

కాగా..భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లోని హన్జా లోయలో కూడా ప్రజలు ఇలాగే చల్లటి నీటితోనే స్నానం చేస్తారు. అక్కడ కూడా చుట్టూ మంచు పర్వతాలే ఉంటాయి. ఎప్పుడూ మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతే ఉంటుంది. అయినా హన్జా వ్యాలీలో ప్రజలకు ఏ వ్యాధులూ రావటంలేదు అంటే ఈ చల్లటి నీటి స్నానాలేనట.

వాళ్లు 100 ఏళ్లకు పైగా జీవిస్తున్నారు. ముసలివాళ్లు కూడా వయస్సులో ఉన్నవారిలాగానే కనిపిస్తారు. వాళ్ల ఆరోగ్య రహస్యాల్లో..ఈ చల్లటి నీటితో స్నానం చేయడం కూడా ఒకటని పరిశోధనల్లో తేలింది. కాగా అంత మంచు కురుస్తుంటే పిల్లలెవ్వరూ ఐస్ వాటర్ తో స్నానం చేయటానికి ఏమాత్రం వెనుకాడరు..చక్కగా హ్యాపీగా వచ్చి స్నానం చేస్తుంటారు.