Siddharth's ARUVAM First Look -10TV

సిద్దార్థ్ అరువం ఫస్ట్ లుక్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నూతన సంవత్సరం సందర్భంగా, ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న అరువం ఫస్ట్ లుక్

చాలాకాలం తర్వాత గృహం సినిమాతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు హీరో సిద్దార్థ్. ప్రస్తుతం తమిళ్‌లో, సాయి శేఖర్ డైరెక్షన్‌లో, అరువం అనే మూవీ చేస్తున్నాడు. ఫస్ట్ టైమ్ కేథరిన్, సిద్దార్థ్‌తో హీరోయిన్‌గా నటిస్తుంది. నూతన సంవత్సరం సందర్భంగా, ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న అరువంకి అనే టైటిల్‌కి అర్థం ఏంటంటే, రూపానికి వికృత పదమే అరువం… ప్రతి మనిషిలోనూ వేరే యాంగిల్ ఉంటుందనే విషయాన్ని అరువం ద్వారా చెప్పబోతున్నారట. కబీర్ సింగ్, స్టంట్ సెల్వ, మధుసూధన్ రావు తదితరులు నటిస్తున్న అరువం సినిమాకి సంగీతం : థమన్, కెమెరా : ఎన్‌కే ఏకాంబరం

Related Posts