అందమైన ఫిజిక్ లేకపోయినా.. పార్టనర్‌తో లైంగిక జీవితాన్ని ఇలా ఎంజాయ్ చేయొచ్చు!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Signs of Sexual Confidence : ప్రతిఒక్కరిలో లైంగిక భావన ఒక్కోలా ఉంటుంది.. అది వారి శరీరతత్వంపై ఆధారపడి ఉంటుంది.. కొన్నిసార్లు తమలో ఆత్మానూన్యత భావన కారణంగా తమను తాము కించపరుచు కుంటుంటారు. పార్టనర్ ముందు తన శరీర సౌష్టవం అందంగా లేదనే భావనలో చాలామంది రొమాన్స్ చేయడాన్ని ఆస్వాధించలేకపోతుంటారు.

అందుకే లైంగికంగా ధృడమైన విశ్వాసం ఉన్నవారిలో రొమాన్స్ ఓ అద్భుమైన అనుభూతిగా అనిపిస్తుందని అంటున్నారు సెక్సాలిజిస్టులు. తమ శరీరతత్వం సౌకర్యంగా అనిపించినప్పుడు వారిలో తెలియకుండానే సెక్సువల్ కాన్ఫిడెన్స్ ఒక్కసారిగా పెరిగిపోతుందంట.. తన లైంగిక పార్టనర్ అవసరాలకు తగినట్టుగా నడుచుకుంటూ దాంపత్య జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తుంటారంట..బెడ్ రూంలో, బయట తాము ఎలా ఉంటున్నాము అనేది ఇరువురు పార్టనర్లు ఓసారి ఆలోచించుకోవాలని Melbourne sexologist Kassandra Mourikis సూచిస్తున్నారు. సాధారణంగా లైంగికపరమైన జోకులు లేదా సెక్సువల్ టాక్ తరచూగా మాట్లాడుతుంటారో వారిలో సెక్సువల్ కాన్ఫిడెంట్ ఎక్కువగా కనిపిస్తుందని అంటున్నారు. కానీ, కొన్నిసార్లు చాలామంది లైంగిక జీవితాన్ని అసౌకర్యంగా ఫీలువుతుంటారు.. అందుకు ఎన్నో కారణాలు ఉండొచ్చు.. వీరిలో శృంగారంపై పెద్దగా ఆశ్వాదించలేరు..

లైంగిక విశ్వాసం అనేది ఫ్లూయిడ్ లాంటిది :
ఆత్మవిశ్వాసం అనేది ఒక ఫ్లూయిడ్ లాంటిది.. లైంగిక విశ్వాసం కూడా అంతేనంటున్నారు.. శరీరంలోకి ఫ్లూయిడ్ ఎక్కించగానే ఒక్కసారిగా ఎలా యాక్టివ్ గా పనిచేస్తోందో అలాగే లైంగికంగా కూడా సెక్సువల్ కాన్ఫిడెన్స్ ఉన్నవారు అలానే యాక్టివ్‌గా ఫీలవుతారని సిడ్నీ యూనివర్శిటీలోని సెక్సాలజీలో సీనియర్ లెక్చరర్ Dr Chris Fox వివరణ ఇచ్చారు.పార్టనర్‌కు ఎలా కనిపిస్తున్నానే ఆందోళన :
చాలామందిలో తమ పార్టనర్ ముందు ఎలా కనిపిస్తున్నామో ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంటుంది.. తమ శరీరం అందంగా కనిపిస్తుందో లేదోనని దిగులు చెందుతుంటారు.. ప్రెగ్నెన్సీ తర్వాత Nanthini అనే 32ఏళ్ల మహిళలో ఇలాంటి ఆందోళనే మొదలైంది.. ప్రెగ్నెన్సీ తర్వాత తాను చాలా బరువు పెరిగింది. మునపటిలా నాజుగ్గా లేదు.ఇప్పుడు తన భర్తకు అందంగా కనిపించడం లేదనే భావనే ఎక్కవగా కనిపిస్తోంది. తన పార్టనర్‌ను రొమాన్స్ అట్రాక్ట్ చేసేలా లేననే ఆత్మనూన్యత భావనతో తమలోనే తాము మదన పడిపోతుంటారు. అదే భావనలో రొమాన్స్ సమయంలోనూ చాలామంది తమ పార్టనర్ నేరుగా కళ్లలో కళ్లు పెట్టి చూడలేరు.

ఎంతసేపు తాను ఎలా పార్టనర్ కు కనిపిస్తున్నామనే భావనే మదిలో తిరుగుతుంటుంది. రొమాన్స్ సమయంలో తన పార్టనర్.. నువ్వు చాలా ఆకర్షణీయంగా ఉన్నావని మెచ్చుకున్నా సరే.. వారిలో ఆ భావన అలానే ఉంటుంది.. వాస్తవానికి అందరి శరీరాలు అందమైనవే.. అది వారి ఆలోచించే విధానం బట్టి మారుతుంటుందని సెక్సాలిజిస్టులు చెబుతున్నారు.

sexual confidence ఎలా ఉంటుందంటే? :
లైంగిక విశ్వాసం అంటే.. మీ శరీర ఆకృతి గురించి మీరేలా ఫీల్ అవుతున్నారో చూసి చెప్పొచ్చు.. లైంగిక విశ్వాసానికి సంబంధించి చాలా సంకేతాలు ఉన్నాయి. ఈ విషయాల్లో ఇతరుల కంటే లైంగిక భావనలో మీరెంతో కాన్ఫిడెంట్ గా కనిపిస్తారు..నాకేం తక్కువ.. లైంగిక అర్హతపై విశ్వాసం:
చాలామందిలో తాను లైంగిక ఆనందానికి అర్హులు కాదని తెగ ఆందోళనపడి పోతుంటారు.. వాస్తవానికి లైంగిక విశ్వాసం ఉన్న వ్యక్తుల్లో వారిలో ఆనందం, సంతోషం అనే భావనే రెండు ఆయుధాలు.. అందుకే వారు తమ పార్టనర్‌తో రొమాన్స్‌ను ఎంజాయ్ చేయగలరు..

మీలో లైంగిక కోరికలను అర్థం చేసుకోండి :
లైంగిక విశ్వాసం అనేది మీలోని లైంగిక కోరికలను బట్టి మారుతుంటుంది.. తమలోని కోరికలను పార్టనర్ ముందు వ్యక్తపరచగలగాలి.. తమలోని లైంగిక భావనలను ఎలా కమ్యూనికేట్ చేయాలో అవగాహన ఉండాలి.. లైంగిక కోరికలను పార్టనర్ కు అర్థమయ్యేలా చెప్పగలగాలి.. మంచి కమ్యూనికేటర్ గా ఉండాలి.. కొన్నిసార్లు పార్టనర్ చెప్పేది కూడా ఆసక్తిగా వినాలి.. అప్పుడే రొమాన్స్ సాఫీగా సాగుతుంది.మీ లైంగిక పరిమితులేంటో తెలుసుకోండి :
సెక్సువల్ కాన్ఫిడెంట్ ఉండే వ్యక్తుల్లో వారికి తమ లైంగిక పరిమితులను ఎలా సెట్ చేసుకోవాలో బాగా తెలిసి ఉంటుంది.. ఇతరులతో అంగీకారం తెలిపే విషయంలో ఈ పరిమితులను కచ్చితంగా ఫాలో చేస్తుంటారు.. మీకు ఏది ఇష్టమో.. ఏది ఇష్టం లేదో ఎదుటి వ్యక్తులతో అర్థమయ్యేలా చెప్పగలగాలి.. అప్పుడే వారిని లైంగిక పార్టనర్‌గా అంగీకరించాలి..

Related Posts