no-mask

అక్కడంతేనండోయ్ : మాస్క్ పెట్టుకోకపోతే నడిరోడ్డుపై ‘నిరీక్షణ శిక్ష’

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా కట్టడి కోసం ప్రతీ ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలి. అది నేటి కరోనా కాలంలో తప్పనిసరి రూల్. ఆ రూల్ ని అతిక్రమిస్తే కొన్ని రాష్ట్రాలు నగదు జరిమానా..లేదా జైలు అంటూ హెచ్చరిస్తున్నాయి. ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతూ..మాస్క్ లు పెట్టుకోకుండా బైటకొస్తే..జరిమాలు కాదు..ఓ విచిత్రమైన శిక్షలు వేస్తున్నారు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి ట్రాఫిక్ పోలీసులు.

మాస్క్ పెట్టుకోకుండా రోడ్డుపైకి వచ్చివారిని నడి రోడ్డుపై రెండు గంటలపాటు కూర్చోబెట్టి ‘నిరీక్షణ శిక్ష’ విధిస్తున్నారు సిలిగురి పోలీసులు. ఫైన్ వేస్తే ఏదో డబ్బులిచ్చేసి వెళ్లిపోవచ్చు. కానీ..పనులపై వెళ్తున్నవారు ఇలా గంటల తరబడి కూర్చోవటం అదికూడా నడిరోడ్డుపై కూర్చోవటం చాలా ఇబ్బందికరంగా మారింది.

దీంతో తప్పదురా బాబూ ఎందుకొచ్చిన గొడవ అనుకుంటున్న ప్రజలు మాస్క్ పెట్టుకోకుండా బయటికి రావడం మానేశారు. ఇల్లు కదిలితే చాలా ఎక్కడ పోలీసులు కనిపిస్తారో..రోడ్డు పై రెండు గంటలు కూర్చోబెడితే పరువు పోతుందని కంపల్సరిగా మాస్క్ లు పెట్టుకుంటున్నారు.ఇంకోసారి మాస్క్ పెట్టుకోకుండా బయటికి రాముసార్..అని చెబుతున్నారు.

సిలిగురిలో కరోనా వైరస్ కేసులు పెరిగిన నేపథ్యంలో స్థానిక పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని 9 మున్సిపల్ వార్డులు, డార్జిలింగ్, జల్ పాయ్ గురి జిల్లాల్లో పూర్తిగా లాక్ డౌన్ విధించారు.

Read here>>ప్రపంచ జనాభా దినోత్సవం 2020: మన దేశ జనాభా 307 కోట్లు ఉండేది!

Related Posts