లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘సిల్క్ స్మిత’ మరో బయోపిక్ వస్తోంది!

Published

on

Silk Smitha biopic : ఒకప్పుడు సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపేసిన సిల్క్ స్మిత… జీవితం ఆధారంగా మరో చిత్రం తెరకెక్కబోతోంది. ఈ గ్లామర్ క్వీన్.. పేరు చెప్పగానే అందరికి ముందుగా గుర్తుచ్చే పాట… బావలు సయ్యా… ఈ పాట అప్పట్లో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.తనదైన శైలిలో నటన, అందం, అభినయంతో ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేసింది సిల్క్ స్మిత.. సిల్క్ స్మిత అంటే చాలు.. కుర్ర‌కారులో సెగలు పుట్టాల్సిందే… వయస్సు మీరన తాతల గుండెల్లో గుబులు రేపాల్సిందే.. అంతటి అభిమానాన్ని సంపాదించుకుందీ గ్లామర్ క్వీన్.సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన గ్లామ‌ర్ క్వీన్ అక‌స్మాత్తుగా మరణించారు. గతంలో సిల్క్ స్మిత జీవితం ఆధారంగా హిందీలో విద్యాబాలన్ నటించిన ‘డర్టీ పిక్చర్‌’ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సిల్క్ స్మిత జీవితం ఆధారంగా త‌మిళంలో సినిమాను తెర‌కెక్కించనున్నారు.ఈ మూవీకి ‘అవళ్‌ అప్పడిదాన్‌’ Aval Appadithan (ఆమె అంతే) అనే టైటిల్‌ ఖరారు చేసినట్టు సినీవర్గాల సమాచారం. ఈ సినిమాకు కేఎస్ మ‌ణికంద‌న్ (KS Manikandan) ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా ల‌క్ష్మ‌ణ్‌, హెచ్‌.ముర‌ళి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీని న‌వంబ‌ర్‌లో సెట్స్ మీద‌కు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.హిందీ ‘డర్టీ ఫిక్చర్’ (Dirty Picture) మూవీలో సిల్క్ సిత్మ రోల్ విద్యా బాలన్ (Vidya Balan) నటించగా… తమిళ చిత్రంలో సిల్క్‌స్మిత రోల్ ఎవరూ చేయబోతున్నారనేది ఇంకా వెల్లడించలేదు. సిల్క్ స్మిత రూపురేఖలు, హవాభావాలు పలికించగల నటులు అయితే మూవీకి పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలుస్తుందని ఫిల్మ్ మేకర్లు భావిస్తున్నారు. సిల్క్ స్మితను గుర్తుచేసేలా నటించగల నటి కోసం వెతుకున్నారంట.. ప్రస్తుతానికి చిత్ర యూనిట్ అదే పనిలో ఉన్నారని సమాచారం.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *