silver-coins-and-copper-sri-sailams-ghantamath-lard-shiva-temple-wall

శ్రీశైలం గుడి గోడలో పురాతనకాలంనాటి తామ్రశాసనాలు, వెండినాణేలు లభ్యం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

శ్రీశైలంలోని పంచ మఠాల్లో ఒకటైన ఘంటామఠం ప్రాంగణంలో మంగళవారం (సెప్టెంబర్ 15,2020) ఉన్న చిన్న శివాలయ పునరుద్ధరణ పనులు చేస్తుండగా బ్రిటీషు కాలంనాటి నాణాలు..తామ్రపత్రాలు లభ్యమయ్యాయి. దేవాలయం పునరుద్దరణ పనులు చేస్తుండగా ఆలయ గోడల నుంచి పురాతన తామ్ర శాసనాలు, వెండి నాణేలు బైటపడ్డాయి.


కవలల ప్రాణం తీసిన తల్లి వివాహేతర సంబంధం


వీటిలో మూడు తామ్రపత్రాలు, 245 వెండి నాణేలు ఉన్నాయని అధికారులు తెలిపారు. గోడలనుంచి బైటపడిన ఈ తామ్రశాసనాలపై దేవ నాగరి, కన్నడ లిపితో కూడిన అక్షరాలు ఉన్నాయని..అలాగే శివలింగానికి రాజు నమస్కరిస్తున్నట్టుగా ఉన్న విగ్రహం..నంది, గోవు చిత్రాలు ఉన్నాయని ఆలయ అధికారులు తెలిపారు.


ఆలయ గోడలనుంచి పురాతన వస్తువులు బైటపడ్డాయని తెలిసిన దేవస్థానం ఈవో రామారావు తహసీల్దారు రాజేంద్రసింగ్, ఎస్సై హరిప్రసాద్‌లతో సహా ఆలయానికి చేరుకుని వాటిని పరిశీలించారు. వెండినాణేలను 1800-1900 సంవత్సరాల మధ్య బ్రిటిష్ పాలన నాటివిగా అధికారులు గుర్తించారు. తామ్ర పత్రాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related Posts