ఆలయాల్లో అసలేం జరుగుతోంది.. దుర్గగుడిలో మూడు సింహాలు మాయంపై బీజేపీ సీరియస్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దుర్గ గుడిలో అమ్మవారి రథానికి ఉన్న మూడు సింహాలు మాయం కావడానికి .. ఆలయ ఈఓ ఆధ్వర్యంలో నడుస్తున్న సెక్యూరిటీ సిబ్బందే కారణమన్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. రథానికి ఉన్న నాలుగు సింహాల్లో ఒక సింహం మాత్రమే ఉందని చెప్పారు. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా.. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

నాలుగు సింహాల్లో ఒక్కటే మిగిలింది, 3 సింహాల విలువ రూ.15లక్షలు:
అంతర్వేది రథం దగ్ధం ఘటన మరువక ముందే బెజవాడ కనకదుర్గమ్మ వెండి ఉత్సవ రథానికి ఉన్న మూడు వెండి సింహాల విగ్రహాలు మాయమయ్యాయి. ఒక్క సింహం విగ్రహం మాత్రమే మిగిలింది. దానిని కూడా పెకలించేందుకు ప్రయత్నించి.. విఫలమైనట్లుగా కనిపిస్తోంది. దుర్గగుడి ప్రాంగంణంలోనే ఉన్న వెండి రథానికి ఉన్న సింహాలు మాయం కావడం సంచలనం సృష్టిస్తోంది. మాయమైన మూడు వెండి సింహాల విలువ దాదాపు 15 లక్షల రూపాయలు.

70కిలోల వెండి, రూ.50లక్షల ఖర్చుతో 20 ఏళ్ల క్రితం రథం తయారీ:
కనకదుర్గ అమ్మవారిని ఉగాది రోజున వెండి రథంపై ఊరేగిస్తారు. సుమారు 20 ఏళ్ల క్రితం ఈ వెండి రథాన్ని తయారు చేయించారు. సుమారు 70 కేజీలకుపైగా వెండితో ఈ రథానికి తాపడం చేశారు. దీనికోసం అప్పట్లోనే సుమారు 50 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. రథం నాలుగు స్తంభాలకు నాలుగు వెండి సింహాల విగ్రహాలను అమర్చారు. ఒక్కో సింహం విగ్రహానికి 8 కేజీల వెండిని తాపడం చేసినట్లు సమాచారం. ఇప్పుడు 3 సింహాలు మాయమయ్యాయి. అంటే, మొత్తం 24 కేజీల వెండి చోరీకి గురైనట్లు తెలుస్తోంది.

అప్పుడు అంతర్వేది, ఇప్పుడు బెజవాడ.. దుర్గ గుడిలో మూడు సింహాలు మాయం, విలువ రూ.15లక్షలు


లాక్ డౌన్ సమయంలోనే చోరీ:
రథం దుర్గగుడి ఆవరణలో.. సమాచార కేంద్రానికి సమీపంలోనే ఉంది. ఇక్కడ సిబ్బంది పర్యవేక్షణ కూడా ఉంటుంది. అయినప్పటికీ.. సింహాలు మాయం కావడం అనుమానాలకు తావిస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనే చోరీ జరిగినట్లు భావిస్తున్నా రు. రథానికి టార్పాలిన్‌ పట్టాతో అధికారులు కప్పి ఉంచడంతో ఈ విషయం బయటపడలేదు. టార్పాలిన్‌ను తొలగించడంతో విగ్రహాల మాయం విషయం బయటపడింది.

అమ్మవారి రథం సింహాలు మాయం కావడంపై దుర్గ గుడి ఈఓ సురేష్‌ బాబు స్పందించారు. రథానికి ఉన్న నాలుగు సింహాల్లో ఒక్క సింహమే ఉండటంపై.. సీసీ ఫుటేజ్‌ పరిశీలించి, సిబ్బందిని విచారిస్తామన్నారు. అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

గత ప్రభుత్వం హయాంలో జరిగిందో…లేక ఇప్పుడు జరిగిందో విచారణలో తేలుతుంది:
దీనిపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. బుధవారం(సెప్టెంబర్ 16,2020) దుర్గ గుడిలో వెండి రథాన్ని మంత్రి పరిశీలించారు. గుడిలో మూడు వెండి సింహాల విగ్రహాలు మామం అయ్యాయా? అసలేం జరిగింది? అని ఈవో సురేష్ బాబుని అడిగి వివరాలు తెలుసుకున్నారు. వెండి రథంపై ఉండాల్సిన మూడు సింహాల విగ్రహాలు కనిపించడం లేదని మంత్రి చెప్పారు.

ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. రెండు మూడు రోజుల్లో పూర్తి నివేదిక వస్తుందన్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రథాన్ని ఉపయోగించలేదన్నారు. ఇది.. గత ప్రభుత్వం హయాంలో జరిగిందో…లేక ఇప్పుడు జరిగిందో విచారణలో తేలుతుందని మంత్రి చెప్పారు.

READ  చుక్కలు చూపిస్తారా : తెలంగాణ గడ్డ నుంచే ఏపీ పాలిటిక్స్

రథం సింహాలు మాయం కావడంపై దర్యాప్తు చేయిస్తామన్న మంత్రి వెల్లంపల్లి, సాయంత్రంలోపు వాస్తవాలు వెలికితీస్తామన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. తప్పు చేసినట్టు తేలితే అధికారులపై క్రిమినల్‌ కేసులు పెడతామన్నారు.

Related Posts