కరోనా రోగులను గుర్తించే Bluetooth contact-tracing, ఎలా పని చేస్తుందంటే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Singapore distributes :  కరోనా ప్రపంచాన్ని మొత్తం వణికిస్తోంది. చైనా నుంచి వచ్చిన ఈ మహమ్మారి..ఆరు నెలల నుంచి ప్రజలను అష్టకష్టాల పాలు చేస్తోంది. దీనికి వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే..కరోనా సోకిన వారిని గుర్తించేందుకు భారతదేశం ఆరోగ్య సేతు యాప్ ను రూపొందించిన సంగతి తెలిసిందే.పలు దేశాలు యాప్ లను రూపొందిస్తున్నాయి. అలాగే సింగపూర్ ప్రభుత్వం కూడా ఒక యాప్ ను రూపొందించింది. కానీ..ఈ యాప్ భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొంది. తాజాగా..కోవిడ్ కాంటాక్ట్ ట్రేసింగ్ టోకెన్స్  (Covid contact-tracing tokens) ఇస్తోంది. ఎక్కడకు వెళ్లినా దీనిని తీసుకెళితే..కరోనా రోగులు సమీపంలో ఉన్నారో లేదో తెలుస్తుంది.ఒక్క మాటలో చెప్పాలంటే..బ్లూ టూత్ లాగా ఉంటుంది. కరోనా సోకిన వారి బాధితుడి ఊరు, పేరు, ఫోన్ నెంబర్ తదితర వివరాలను నమోదు చేస్తారు. ఆ తర్వాత..ఎక్కడకు వెళ్లినా..ఆ చుట్టుపక్కల ఉన్న మిగతా పరికరాలు అతనికి కరోనా ఉందని సంకేతాలు విడుదల చేస్తాయి. మాల్స్ లోకి వెళ్లినా, ఎక్కడకు వెళ్లినా..దీనిని ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే.

కరోనా లేదని నిర్ధారించుకున్న తర్వాతే..లోపలకు అనుమతినిస్తారు. నెగటివ్ రిపోర్టు వచ్చిన తర్వాత..అధికారులే మార్పులు చేస్తారు.

Related Posts