పాప్ సింగర్ స్మితకు కరోనా పాజిటివ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పాప్ సింగర్ స్మిత కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఒళ్లు నొప్పులుగా ఉండటంతో అనుమానం వచ్చి టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలిందన్నారు.“నిన్న నిజంగా దుర్దినం.. ఒళ్లు నొప్పులుగా ఉండటంతో , బహుశా ఎక్కువగా వ్యాయామం చేయటం వల్ల అలా ఉందేమో అనుకున్నాను. ఎందుకైనా మంచిదని కరోనా టెస్ట్ చేయించుకున్నాను. శశాంక్, నేను కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. తనకు కరోనా లక్షణాలు అంతగాలేవని..దీన్ని తన్నితగలేస్తానని చెప్పారు. అనంతరం ప్లాస్మాదానం చేస్తాం మేం ఇంట్లోనే ఎంతో జాగ్రత్తగా ఉన్నామని..అయినా కరోనా సోకిందని ” ట్వీట్ చేశారు.

ఐసోలేషన్ లోనే ఉండి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సెలబ్రిటీలను కరోనా వదలటం లేదు. బాహుబలి దర్శకుడు రాజమౌళి కుటుంబ సభ్యులతో కలిసి ఫాం హౌస్ లో జాగ్రత్తలు తీసుకున్నావారికి కరోనా సోకింది. కరోనా నెగిటివ్ వచ్చినా..కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు యాక్టర్ పృధ్వీ. ఇప్పటికే కరోనా సోకి నిర్మాత పోకూరి రామారావు కన్నుమూశారు.


Related Posts