లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఘనంగా స్టార్ సింగర్ సునీత మ్యారేజ్

Published

on

singer sunitha marriage : టాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌ సునీత పెళ్ళి ఘనంగా జరిగింది. మ్యాంగో డిజిటల్‌ మీడియా అధినేత రామ్‌ వీరపనేనితో కలిసి ఆమె ఏడడుగులు వేశారు. రాత్రి 9.46 నిమిషాలకు వీరి వివాహం జరిగింది. శంషాబాద్‌లోని శ్రీరాముని ఆలయంలో బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి కేవలం అతికొద్దిమంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.

ఇక డిసెంబర్ 26 రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రముఖ హోటల్లో వీళ్ల ప్రీ వెడ్డింగ్ పార్టీ జరిగింది. పెళ్లికి పది రోజుల ముందే తమ వాళ్లకు పార్టీ ఇచ్చారు ఈ జంట. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్ని రోజుల కింద రామ్ తో సునీత నిశ్చితార్థం జరిగింది. అప్పుడు ఎలాంటి సందడి లేకుండానే ఈ వేడుక పూర్తి చేసారు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత ప్రీ వెడ్డింగ్ పార్టీ మాత్రం స్నేహితులు, నటులు, సింగర్స్ సమక్షంలో జరిగింది.

ఇది ఇద్దరి వ్యక్తులకు సంబంధించిన వేడుక కాదని.. రెండు కుటుంబాల కలయిక అని చెప్పారు సునీత. ఇందులో పెళ్లి అనే మాట కంటే కూడా దైవత్వమే తనకు కనిపిస్తుందని చెప్పింది. మరోవైపు సునీత మెహందీ వేడుక ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. పసుపు రంగు చీరలో మెరిసిపోయారు సునీత. ఇందులో సునీత కుమారుడు, కూమార్తె కూడా ఉన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *