ఇండియాలో మిలియన్ల కొద్దీ అమ్మాయిలు పెళ్లి రిజక్ట్ చేస్తున్నారు.. మీకు తెలుసా!!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మోడరన్ ఇండియాలో అన్ని మార్పులు కనిపిస్తున్నాయి. 47ఏళ్ల డెవలప్‌మెంట్ ప్రొఫెషనల్ డెబ్బీ పాల్ భర్త లేకుండానే గడిపేస్తున్నారు. న్యూ ఢిల్లీలో ఒంటరిగా ఉంటున్న ఈమె.. సామాజిక అంచనాలకు విరుద్ధంగా బతకడానికి ఇష్టపడుతున్నారు.

చరిత్రలో లేనంతగా చాలా మంది మహిళలు ఒంటరిగా గడిపేస్తున్నారు. వైధవ్యం అనుభవిస్తున్నవారు, విడాకులు తీసుకుని, పెళ్లి చేసుకోకుండా ఉన్న వారు దేశ జనాభాలో 21శాతం మంది వరకూ ఉన్నారు. దేశ జనాభాలో 51మిలియన్ మంది మహిళలు ఒంటరిగానే ఉంటున్నారని 2001 జనాభా లెక్కలు చెబుతున్నాయి.అదే 2011 జనాభా లెక్కలను బట్టి చూస్తే.. అది 40శాతం పెరిగి 71.4 మిలియన్లకు చేరిందట. జీవితాన్ని గడపడంలో ఒంటరి మహిళలకు విద్య, కెరీర్ విషయాల్లో ఎక్కువ స్వేచ్ఛ దొరుకుతుందని వారు భావిస్తున్నారు. కుటుంబపరమైన ఒత్తిళ్లు, అంకితమైపోవాల్సిన సేవ పెళ్లి కారణంగా ఇండియన్ మహిళలపై కనిపిస్తుంది.

వీటితో పాటుగా దారుణమైన పెళ్లిళ్లు చేసుకోవడానికి, గృహ హింసను ఎదుర్కోవడానికి ఇష్టం లేక సింగిల్ గా ఉండటానికే మొగ్గు చూపుతుండటంతో మహిళా సాధికారత అనేది పెరుగుతూ వస్తుంది. లింగ సమానత్వంలో ఇంకా సమాజం వెనుకబడే ఉందని వీళ్లందరి ఉద్దేశ్యం.

దీనిపై న్యూ ఢిల్లీలోని ఓ సామాజిక వేత్త మాట్లాడుతూ.. ‘పెళ్లి కాకుండా ఒంటరిగా ఉండిపోయినప్పుడు బంధువు లేదా భర్త తోడు లేకుండా గడిపే వాళ్లకు రిస్క్ ఎక్కువని సమాజం భావిస్తుంది. అటువంటి మూస ధోరణి నుంచి చాలా మంది మహిళలు బయటకు వచ్చేశారు. వారి కష్టాలు వాళ్లే పడుతున్నారు’ అని ఆమె అంటున్నారు.

Status Single అనే పుస్తకాన్ని రాసిన శ్రీమోయీ ప్యూ కుందూ అనే జెండర్ కాలమిస్టూ.. స్టేటస్ సింగిల్.. ద ట్రూత్ అబౌట్ బీయింగ్ ఏ సింగిల్ ఉమెన్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో 3వేల మంది రోజువారీ జీవితాల్లో మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న అసమానత, అన్యాయం గురించి పొందుపరిచారు.

‘ఇందులో కొందరి అనుభవాలను యథార్థంగా ప్రచురించడానికి ఒప్పుకున్నా.. మిగిలిన వారు కుటుంబంలో ఏమైనా అనుకుంటున్నారేమోననే భయంతో ఇందులోనూ నిజమైన ఫీలింగ్స్ చెప్పొద్దని వేడుకుంటున్నారు. మరి కొందరు ఐడెంటిటీ బయటకు చెప్పద్దని అంటుంటే సింగిల్ గా ఉండే వారు మాత్రం తమ అభిప్రాయాలను సగర్వంగా పంచుకుంటున్నారు.

దీనిపై రచయిత మాట్లాడుతూ.. ‘సింగిల్ గా ఉంటే ఒంటరితనం, మానసిక ఆరోగ్యం అన్నింటిపై ప్రభావం చూపిస్తుంటాయి’ అని అన్నారు.

Related Tags :

Related Posts :