Updated On - 8:27 am, Tue, 23 February 21
Single vaccine dose gives high protection from severe Covid : ప్రపంచమంతా కరోనావైరస్ మహమ్మారితో అల్లాడిపోతోంది. కరోనావైరస్ నిర్మూలన కోసం అనేక రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఏ వ్యాక్సిన్ ఎంత స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తుందోనన్న అపోహలు, అనుమానాలు లేకపోలేదు. అయితే ఒక వ్యాక్సిన్ డోస్ ఇస్తే చాలు.. తీవ్రమైన కరోనా నుంచి అధిక రక్షణ ఇస్తుందని తేలింది. అంతేకాదు.. కరోనాతో ఆస్పత్రిలో చేరే అవకాశాలను భారీగా తగ్గించిందని రుజువైంది. ఇంగ్లాండ్, స్కాట్లాండ్ లో నిర్వహించిన కోవిడ్ టీకా కార్యక్రమాల్లో నిర్ధారించారు. ముఖ్యంగా యువతలో లక్షణాలు లేని కరోనా బారినపడిన వారిని కూడా ఈ వ్యాక్సిన్ డోస్ రక్షించగలదని తేల్చేశారు.
వ్యాక్సినేషన్ ప్రొగ్రామ్ ద్వారా మొదటి డేటాను పరిశోధకులు పరిశీలించారు. ఈ డేటాలో వైరస్ వ్యాప్తిని టీకాలు పూర్తిగా నిరోధించాయని, కొంతమంది వ్యక్తుల్లో వైరస్ బారిన పడకుండా నివారించినట్టు డేటాలో తేలింది. స్కాట్లాండ్లో ఒకటి, ఇంగ్లాండ్‌లో రెండు గ్రూపుల్లో కరోనా వ్యాప్తిని నియంత్రించినట్టు డేటాలో గుర్తించారు. ఇంగ్లాండ్‌లో 65 ఏళ్లలోపు హెల్త్ కేర్ వర్కర్లలో ఫైజర్ / బయోఎంటెక్ వ్యాక్సిన్ ఒక మోతాదు వైరస్‌ను 70శాతం, రెండవ మోతాదు తర్వాత 85శాతం తగ్గిస్తుందని తేలింది.
ప్రతి రెండు వారాలకు వైరస్ టెస్టులను నిర్వహించారు. మొదటి మోతాదు తీసుకున్న 3 వారాల తరువాత, ఫైజర్ / బయోఎంటెక్ టీకా తేలికపాటి లేదా అంతకంటే తీవ్రమైన వ్యాధిపై 57శాతం ప్రభావవంతంగా పనిచేసిందని కనుగొన్నారు. చాలా మందికి రెండవ మోతాదు ఇవ్వలేదు.. అయినప్పటికీ వారిలో టీకా సమర్థత 85శాతం పెరిగిందని సూచించింది.
ప్రారంభ టీకా మోతాదు పొందిన నాలుగవ వారం నాటికి, ఫైజర్ ఆక్స్ఫర్డ్ / ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు కరోనాతో ఆస్పత్రిలో చేరే ప్రమాదాన్ని వరుసగా 85శాతం, 94శాతం వరకు తగ్గించాయని స్కాటిష్ యూనివర్శిటీలు పబ్లిక్ హెల్త్ స్కాట్లాండ్ అధ్యయనం వెల్లడించింది. 80ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల వారిలో ఈ రెండు టీకాలు వేయడం ద్వారా నాల్గవ వారంలో ఆస్పత్రిలో చేరే ప్రమాదాన్ని 81శాతం తగ్గించినట్టు డేటా పేర్కొంది.
నీది 12 అంగుళాలే, నాది 14 అంగుళాలు.. పొడవైన అరటిపండు నాదంటే నాదని వాదన
ఇంగ్లాండ్ పర్ఫార్మెన్స్ పొగిడి చిక్కుల్లో పడ్డ మైకెల్ వాన్
వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్..
ఇంగ్లాండ్‌ను తిప్పేసిన భారత్.. 10వికెట్ల తేడాతో విజయం
ఇంగ్లాండ్ చెత్త రికార్డు.. 50ఏళ్ల తర్వాత!
81పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్.. భారత్ టార్గెట్ 49