లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Life Style

ఒంటరి వాళ్లకు రొమాంటిక్ రిలేషన్‌పై కోరికలు తక్కువంట!

Published

on

romantic relationship partner : తమ జీవితంలో స్నేహితులతో ఎక్కువగా గడిపే ఒంటరివాళ్లలో రొమాంటిక్ సంబంధాలపై కోరికలు చాలా తక్కువగా ఉంటాయట.. తమ స్నేహితులతో సంతృప్తి చెందినవారిలో జీవిత భాగస్వామి వంటి సంబంధాలపై పెద్దగా ఆసక్తి చూపరని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనాన్ని జనరల్ ఆఫ్ సోషల్ అండ్ పర్సనల్ రిలేషన్ షిప్స్‌లో ప్రచురించారు.ఒంటరిగా ఉండే వారి జనాభా పెరిగిపోతోంది. ఒక్క అమెరికాలోనే పెళ్లి అయిన వారి వయస్సు 18 ఉండగా.. 1960లో 72శాతంగా ఉన్న వయస్సు 2016 నాటికి 50శాతానికి పడిపోయిందని హెబ్రివ్యూ యూనివర్శిటీ ఆఫ్ జెరుసలేంలోని పరిశోధకులు Elyakim Kislev చెప్పారు. ఒంటరివాళ్లలో సంబంధ బాంధవ్యాలపై ఎందుకు ఆసక్తి తగ్గిపోతుందో అధ్యయనం చేయాలన్నారు.

వారి జీవన విధానం ఎలా ఉంటుందో కూడా పరిశోధించాల్సిన అవసరం ఉందన్నారు. ఒంటరిగా ఉండే కమ్యూనిటీలు ఎన్నో ఉన్నాయి. వారిలో ప్రవర్తన శైలి కూడా కొత్తగా ఉంటుంది.అలాంటివారిని గుర్తించి పరిశోధించాలని రీసెర్చర్ చెప్పారు. రిలేషన్ షిప్ అంటే ఇష్టపడని కొందరి ఒంటరి గ్రూపులపై తాను ప్రత్యేకించి దృష్టిపెట్టానని చెప్పుకొచ్చారు. మొత్తం ఒంటరి జనాభాలో 20 శాతం వరకు ఈ గ్రూపువాళ్లే ఉంటారని ఆయన అంచనా వేశారు.

జర్మనీ ప్యానెల్ విశ్లేషణకు చెందిన Intimate Relationships and Family Dynamics (Pairfam) నుంచి డేటా సేకరించి రీసెర్చర్ Kislev అధ్యయనం చేశారు. దీనికి సంబంధించి దాదాపు 12వేలుకు పైగా ఒంటరి వ్యక్తులు, వారి పార్టనర్లు, పేరంట్స్, పిల్లలపై సుదీర్ఘ సర్వే నిర్వహించారు.పార్టనర్ కావాలనుకుంటున్నారా? అనేక ప్రశ్నలను కూడా అడిగారు. తమ స్నేహితులతో ఎంతగా సంతృప్తి చెందారు? సామాజిక పరిచయం ఏ స్థాయిలో ఉంది? తమ జీవితంలో స్నేహితులకు ఎంతగా ప్రాముఖ్యత ఇస్తున్నారు అనే విషయాలపై సర్వే నిర్వహించారు.వీరిలో ఎక్కువగా తమ వ్యక్తిగత జీవితంలోని వారికే మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే జీవిత భాగస్వామి కావాలనే కోరికపై తక్కువ ఆసక్తిని కలిగి ఉన్నారని పరిశోధకులు నిర్ధారించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *