లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

ఇండియన్ వ్యాక్సిన్ హిట్.. చైనా వ్యాక్సిన్ ఫ్లాప్.. తేల్చేసిన బ్రెజిల్

Published

on

vaccine general efficacy

Sinovac’s vaccine general efficacy : చైనా వ్యాక్సిన్ కంటే ఇండియన్ వ్యాక్సిన్ ప్రభావంతంగా పనిచేస్తుందని బ్రెజిల్ తేల్చేసింది. చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ అభివృద్ధి చేసిన CoronaVac కోవిడ్ -19 వ్యాక్సిన్ బ్రెజిల్‌లో తన క్లినికల్ ట్రయల్‌లో 60శాతం కన్నా తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉందని రిపోర్టు నివేదించింది. బ్రెజిల్‌లో టీకాను ఉత్పత్తి చేయడానికి సినోవాక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుందని బయోమెడికల్ సెంటర్ అధికారి ఒకరు తెలిపారు. అత్యవసర వినియోగానికి హెల్త్ రెగ్యులేటర్ Anvisa నుంచి షాట్ కోసం ప్రయత్నిస్తోంది. సాధారణ సమర్థత ఫలితాలను విడుదల చేయాలని యోచిస్తోంది. కరోనాతో అల్లాడిపోతున్న బ్రెజిల్.. కరోనా వాక్సిన్ కోసం భారత్‌‌ను సంప్రదించింది.

భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ టీకా తీసుకునేందుకు ముందుకొచ్చింది. భారత్‌ బయోటెక్ కంపెనీతో బ్రెజిల్ మెడికల్ ఏజెన్సీ ఒప్పందం కుదుర్చుకుతంది. కొవాగ్జిన్ సమర్థవంతమైనదని తేలింది. అలాగే ఇండియన్ వ్యాక్సిన్ రోగనిరోధక శక్తి పెంపొందించడంలోనూ సమర్థవంతంగా పనితీరును కనబరించిందని తేలింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ తమ అంచనాలను మించి పనిచేస్తోందని బ్రెజిల్‌ ఫార్మా సంస్థ డెరెక్టర్‌ ఎమాన్యూయేల్‌ మెడ్రాడెస్‌ తెలిపారు.

బ్రెజిల్ ప్రజల ఆరోగ్య అవసరాలకు కొవాగ్జిన్ ఉపయోగడుతుదని అభిప్రాయపడింది. భారత్ SII తయారుచేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ వాక్సిన్‌లకు డీసీజీఐ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రపంచంలో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో బ్రెజిల్‌ మూడో స్థానంలో ఉండగా.. కొవిడ్‌ మరణాల్లో రెండో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు బ్రెజిల్‌లో 77లక్షల మందిలో వైరస్‌ బారినపడ్డారు. లక్షా 96వేల మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్‌ ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా వ్యాక్సిన్‌ పంపిణీ కోసం ప్రయత్నిస్తున్నాయి. బ్రెజిల్‌ నియంత్రణ సంస్థ ‘అన్విసా’ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *