45 రోజులుగా అక్క మృతదేహంతో జీవిస్తున్న చెళ్లెళ్లు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో దారుణం జరిగింది. 45 రోజులుగా అక్క మృతదేహంతో చెళ్లెళ్లు ఆ ఇంట్లోనే ఉంటున్నారు. జూన్ 25న అనారోగ్యంతో అక్క పద్మావతి మృతి చెందింది. కరోనా కారణంగా పద్మావతి అంత్యక్రియలకు స్థానికులెవరూ సహకరించకపోవడంతో అక్క మృతదేహంతోనే ఇద్దరు చెళ్లెళ్లు జీవిస్తున్నారు. మృతదేహం దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులు సమాచారం అందించారు.

చెత్త తొలగించి అడుగున ఉన్న మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. మృతదేహం కింద బంగారు నగలు, 2 లక్షల నగదు, 40 వేల పాత కరెన్సీ లభ్యమైంది. లక్షల్లో డబ్బున్నా అక్కాచెళ్లెళ్లు చెత్త ఏరుకుని జీవనం సాగిస్తున్నారు. అక్క మృతదేహంతో చెత్త గోడౌన్ లో ఇద్దరు చెళ్లెళ్లు ఉంటున్నారు.

చెన్నై నగరంలో ముగ్గురు అక్కాచెళ్లెళ్లు చెత్త ఏరుకుని వాటిని అమ్ముకుని జీవిస్తుంటారు. చెన్నైలోని చెత్త గోడౌన్ లో వీరు నివాసముంటున్నారు. అక్కా అయిన పద్మావతి సరిగ్గా 45 రోజుల క్రితం చనిపోయింది. అయితే కరోనా కారణంగా అంత్యక్రియలకు స్థానికులు సహకరించకపోవడంతో అక్క మృతదేహాన్ని ఏం చేయాలో…ఎలా అంత్యక్రియులు నిర్వహించాలో తెలియక చివరకు చెత్త గోడౌన్ లోనే ఇద్దరు చెళ్లెళ్లు 45 రోజులుగా మృతదేహంతోనే జీవినం సాగిస్తున్నారు. అయితే ఆకస్మికంగా అక్కడి నుంచి పెద్ద ఎత్తున దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని చూసి అవాక్కయ్యారు. నెలన్నర రోజుల క్రితమే పద్మావతి అనే యువతి చనిపోయిన మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించారు. చెత్త గోడౌన్ లో కనిపించిన నగలు, నగదును చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ ముగ్గురు అక్కాచెళ్లెళ్లు వీధుల వెంట తిరుగుతూ చెత్త అమ్ముకుంటూ భారీగానే డబ్బు గడించారు.

గోడౌన్ లోనే 2 లక్షల మేర నగదు, అనేక బంగారు ఆభరణాలతోపాటు దాదాపు 40 వేల రద్దైన కరెన్సీ నోట్స్ లభించాయి. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు, నగలు ఉంచుకుని ఇప్పటికీ కూడా వారు చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తుండటం ఆశ్చర్యం కల్గిస్తోంది. అక్క మృతదేహంతో ఇద్దరు చెళ్లెళ్లు జీవనం సాగించడం సంచలనంగా మారింది.

Related Tags :

Related Posts :