Home » సితార పాపతో సూపర్‌స్టార్.. సౌత్‌లో రేర్ ఫీట్ సాధించిన రౌడీస్టార్.. కొడుకుతో ప్రకాష్ రాజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్..
Published
4 months agoon
By
sekharAdorable Father – Daughter Duo
Mahesh Babu – Sitara: సూపర్‌స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలతో పాటు మహేష్ సినిమా పాటలకు డ్యాన్స్ చేసి ఆ వీడియోలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది. తాజాగా తనకు నచ్చిన ఓ పాత ఫొటోను షేర్ చేసింది సితార పాప.
గతంలో విమానాశ్రయంలో వెయిట్ చేస్తున్న సమయంలో తండ్రి ఒడిలో నిద్రపోతున్న ఫొటోను షేర్ చేసి.. ‘సేద తీరేందుకు ఇంతకన్నా మంచి స్థలం ఎక్కడుంటుంది? నాన్నా.. నువ్వే బెస్ట్’.. అంటూ కామెంట్ చేసింది. సితార పాప కామెంట్‌కు సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
https://www.instagram.com/p/CFvxUYwnsJ_/?utm_source=ig_web_copy_link
9 Milion Followers For Vijay Deverakonda
సోషల్ మీడియాలో క్రేజీ హీరో, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ రోజురోజుకూ మరింత పెరుగుతోంది. తాజాగా సోషల్ మీడియాలో విజయ్ మరో సరికొత్త రికార్డు సాధించాడు. దక్షిణాదిన ఏ స్టార్కీ సాధ్యం కాని రికార్డు నెలకొల్పాడు.
ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో 9 Milion Followers ను సంపాదించాడు. దీంతో మొత్తం దక్షిణాదిలో ఇన్ స్టాగ్రామ్‌లో 9 మిలియన్ ఫాలోవర్స్ ఉన ఏకైక స్టార్‌గా తను రికార్డు క్రియేట్ చేశాడు. దేశవ్యాప్తంగా విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్‌కు ఇది నిదర్శనమని చెప్పొచ్చు.
Prakash Raj Green India Challenge
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా అద్భుతంగా ముందుకు కొనసాగుతోంది. అందులో భాగంగా ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి నేడు షాద్ నగర్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో కుమారునితో కలిసి మొక్కలు నాటారు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్.
ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘‘తనికెళ్ల భరణి ఎప్పుడూ కూడా మంచి పనిలో నన్ను భాగస్వామిని చేస్తారు. నాకు ఇష్టమైన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి, నాకు బాసు కేసీఆర్ గారు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి ఈ అయిదు, ఆరు సంవత్సరాలలో తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణ చేయడం జరిగింది..
ముఖ్యమంత్రి కేసీఆర్, రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు మట్టి మనుషులు.. మట్టితో వారికి అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి ఆ మట్టి పరిమళం విలువ వారికి తెలుసు. వారు మట్టితో మాట్లాడుతారు కాబట్టి మట్టికి చెట్టుకు ఉన్న అనుబంధంతో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.. మొక్కలు పెంచే బాధ్యత మనందరిదీ, ప్రభుత్వం చేస్తుంది కదా అని కాకుండా మనం కూడా బాధ్యతగా తీసుకొని చెట్లను పెంచే కార్యక్రమం చేపట్టాలి..
ఈ చాలెంజ్ ఇదే విధంగా కొనసాగాలని అందులో భాగంగా నా మిత్రుడు మహా నటుడు మోహన్ లాల్, తమిళ్ నటుడు సూర్య , కన్నడ నటుడు రక్షిత్ శెట్టి, హీరోయిన్లు రమ్యకృష్ణ, త్రిష లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరుతున్నాను. అదేవిధంగా అభిమానులకు ప్రేక్షకులు కూడా ఈ చాలెంజ్ ను మీరు స్వతహాగా స్వీకరించి మొక్కలు నాటి పది మందిచేత మొక్కలు నాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’.. అన్నారు.