Six of a family killed in car accident in Greater Noida

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ను హరియాణాతో అనుసంధానం చేసే ఈస్ట్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా.. మృతులలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు చెబుతున్నారు. మరో 8 మంది తీవ్రంగా గాయడినట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ ప్రమాదం గ్రేటర్ నోయిడా పోలీస్ స్టేషన్ పరిధిలోని సైట్-5లో జరగగా.. హరియాణాలోని బల్లాభగడ్‌లో జరిగిన పెళ్లికి హాజరైన 13 మంది కారులో తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం వీరు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

మృతులంతా బులంద్‌షహర్ పరిధిలోని మీఠాపూర్ గులావఠీకి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వెంటనే వీరిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం సహాయ చర్యలు చేపట్టారు పోలీసులు. 

Related Posts