ఆరేళ్ల బుడ్డోడి స్కెచ్‌లతో డ్రైవర్‌ను పట్టుకున్న పోలీసులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Kid Sketch: పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు పెద్దవాళ్లే తడబడి కొన్ని మాటలు, క్లూలు వదిలేస్తుంటారు. డ్రాయింగ్స్ అలా కావు కదా.. ప్రతి విషయం కచ్చితంగా క్లారిటీతో ఉండాలి. అదే సమయంలో డ్రాయింగ్ వేసే ఆర్టిస్ట్ కూడా అంతే మెచ్యూర్ అయి ఉండాలి. కానీ, ఇక్కడ డ్రాయింగ్ వేసింది ఆరేళ్ల బుడ్డోడు.

వెస్ట్ జర్మన్ సిటీకి చెందిన పోలీసులు ఆరేళ్ల బుడ్డోడు స్కెచ్‌ల ఆధారంగా నిందితురాలిని పట్టుకోగలిగారు. క్రైం జరిగిన సమయంలో పిల్లలు రోడ్డు దాటేందుకు నిల్చొని ఉన్నారు. షార్ట్ హెయిర్‌తో ఉన్న మహిళ కార్ డ్రైవింగ్ చేస్తూ.. ఏదైనా డ్యామేజ్ జరుగుతుందని కూడా ఆలోచించకుండా ర్యాష్ గా వెళ్లిపోయింది.ఈ ఘటనను చూసిన లూయిసా, రోమీ, సెలీనా, లూయీస్ స్కూల్ టీచర్ కు కంప్లైంట్ ఇచ్చారు. ఆమె ఓ సలహా ఇచ్చి స్కెచ్‌ గీయించారు. దాంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అందులో డ్రైవర్ ఎలా ఉందనేది క్లియర్ గా గీయగలిగారు. ఎంక్వైరీ చేసిన పోలీసులు నిందితురాలిని పట్టుకోగలిగారు.

ఈ విషయాన్నంతా ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. బుడ్డి డిటెక్టివ్స్, సూపర్ కిడ్స్ అంటూ ఆ బుడతల్ని తెగపొగిడేస్తున్నారు. స్థానికుడైన మిచెల్ స్కాల్టె ‘పిల్లలు చేసిన టెర్రిఫిక్ యాక్షన్‌కు ఆశ్చర్యపోతూ చాలా మంది ఈ పిల్లల్ని చూసి నేర్చుకోవాలని’ అంటున్నారు. ఈ ఘటన జర్మనీలోని ఇండస్ట్రియల్ ప్రాంతమైన డార్ట్‌మండ్‌లో జరిగింది.

Related Tags :

Related Posts :