లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Health

‘skin hunger’ నిజమే.. కరోనా ఆంక్షలతో ‘కౌగిలంత’ కోసం ఆరాటపడుతున్నారంట..!

Published

on

Skin Hunger Can Affect You Mentally : కరోనావైరస్ మహమ్మారి ఆంక్షల కారణంగా ఒకరినొకరు ముట్టుకునే పరిస్థితి లేదు.. తాకాలంటేనే భయపడిపోతున్నారు. నెలల తరబడి సామాజిక దూరానికి అలవాటు పడిపోయారంతా. కరోనాకు ముందు కౌగిలింతలు, షేక్ హ్యాండ్‌లతో స్వాగతం చెప్పుకున్నవారంతా ఇప్పుడు దూరం.. దూరం అంటున్నారు..కరోనా ఆంక్షలతో చాలామంది తీవ్రమైన ‘స్కిన్ హంగర్’ సమస్యను ఎదుర్కొంటున్నారంట. కౌగిలింతల కోసం తెగ ఆరాటపడిపోతున్నారంట.. మానవ స్పర్శ లేకపోవడం వల్ల శారీరకంగా, మానసిక-ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంట.

ఫలితంగా మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది. అధిక ఒత్తిడితో రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతోంది. సరైన నిద్ర ఉండటం లేదని తమ అనుభవాలను మానసిక నిపుణులకు చెప్పుకుంటున్నారు.

మీ ఫోన్‌‌పై పడిన scratches పోవాలంటే ఇలా చేయండి!


పిల్లలు, పెద్దలు, కుటుంబ సభ్యులు.. ప్రేమికులు అందరిలోనూ ఇదే ఆందోళన వ్యక్తమవుతోంది.నెలల తరబడి ఒకరినొకరు ఎదురుగా కనిపించినా ప్రేమగా దగ్గర తీసుకునే పరిస్థితి లేదు. ప్రేమికులు కలవలేకపోతున్నారు.. ముద్దుముచ్చట్లు లేకుండా పోయాయని బాధపడిపోతున్నారు. ప్రియమైన వారిని కౌగిలించుకోవాలనే కోరిక ప్రతిఒక్కరిలోనూ ఉంటుంది.

కరోనా లాక్ డౌన్ సమయంలో ఒంటరిగా ఉండటం అలవాటుపడిన వారంతా మళ్లీ తమ ప్రియమైన వారితో కలిసి ఆనందంగా గడపాలని భావిస్తున్నారు. కౌగిలింత కోసం ఆరాట పడిపోతున్నారు.. ఒకరినొకరు తాకాలని మనస్సు తపించి పోతోందని చెబుతున్నారు.

తాకితే చాలు.. ‘లవ్ హార్మోన్’ పుడుతుంది :
పుట్టినప్పటి నుంచి శరీర స్పర్శకు అలవాటు పడిన మానవులు.. కరోనా ఆంక్షలతో దూరంగా ఉండటం మూలంగానే ఈ సమస్యకు దారితీసిందని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇతరులను తాకవలసిన అవసరం ప్రతిఒక్కరికి ఉంటుంది. తాకినప్పుడే మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది.. హృదయనాళ ఒత్తిడిని తగ్గిస్తుంది.అప్పుడు “లవ్ హార్మోన్” ఆక్సిటోసిన్ ను యాక్టివ్ అవుతుంది. ఒకరి నొకరు కౌగలించుకోవడం ద్వారా అల్జీమర్స్ వ్యాధి నుంచి క్యాన్సర్ వరకు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వరకు నయం చేయగలదని పరిశోధనలో తేలింది.

ఒంటరి జీవితంలో చాలామంది ఓదార్పు కోసం ఆరాటపడుతుంటారు.. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రతిఒక్కరిలోనూ ఇలాంటి అనుభవమే ఎదురవుతుందని అంటున్నారు.

ఇలా స్కిన్ హాంగర్ తగ్గించుకోవచ్చు :
ప్రతి ఒక్కరి స్పర్శ అవసరాలు ఒకేలా ఉండవు. గత అనుభవాలు, ముఖ్యంగా బాధాకరమైనవి విషయాలను బట్టి ఉంటాయి. ఆలింగనం కోసం ఆరాట పడుతున్నారా? అయితే మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉండేందుకు కొన్ని మార్గాలు అందుబాటులో ఉన్నాయి.మీ స్వంత లేదా పొరుగువారి పెంపుడు కుక్కలు లేదా పిల్లులను దగ్గరకు తీసుకోవచ్చునని సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా బ్లడ్ ప్రెజర్, ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుందని అంటున్నారు. లేదంటే.. దిండును కౌగిలించుకోవాలని సూచిస్తున్నారు. ఇది మీ చర్మానికి ఒత్తిడి నుండి ప్రశాంతతను కలిగిస్తుంది.ఒక వ్యక్తి లేదా పెంపుడు జంతువు నుండి ఎలాంటి స్పర్శను పొందుతారో అదే అనుభూతిని పొందవచ్చు. స్వీయ-స్పర్శ లేదా మసాజ్ కూడా ఎంతో సహకరిస్తుందని అంటున్నారు.

కొన్ని పరిశోధనల్లో భుజానికి తాకడం లేదా మీ చేతులు, కాళ్ళను రుద్దడం వల్ల వేరొకరు చేసినట్లుగా నొప్పిని తగ్గించే ప్రయోజనాలు చాలా ఉంటాయని చెబుతున్నారు.

ఇలా చేయడం ద్వారా ఆరోగ్యపరంగానే కాదు.. మానసికంగానూ మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు.

మీలోనూ స్కిన్ హాంగర్ సమస్య ఉందా? అయితే మీ ప్రియమైన నేస్తాన్ని హత్తుకోవడం ద్వారా సమస్యను దూరం చేసుకోవచ్చు.. మానసిక ఒత్తిడిని నుంచి బయటపడొచ్చు..

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *