తెలంగాణలో కొత్తగా  879 కరోనా కేసులు

  • Published By: bheemraj ,Published On : June 23, 2020 / 07:29 PM IST
తెలంగాణలో కొత్తగా  879 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు  అంతకు అంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణలో కొత్తగా  879 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 652 కేసులు నమోదయ్యాయి. మంగళవారం (జూన్ 23, 2020) కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు 220 మంది మృతి చెందారు. తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 9,553 కు చేరింది. రాష్ట్రంలో 5,109 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటి వరకు 4,224 డిశ్చార్జ్ అయ్యారు. 

ఇదే వరస కొనసాగినట్లైతే రేపటికి 10,000 కేసులు రికార్డును దాటే అవకాశం ఉంది. గత మూడు, నాలుగు రోజుల నుంచి చూస్తే 700, 800 దాటి కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం కూడా 879 కరోనా  పాజిటివ్ కేసులు నమోదైతే అందులో కేవలం హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ పరిధిలో 652 కేసులు నమోదయ్యాయి. మరోవైపు మేడ్చల్ జిల్లాలో కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి  ఇప్పటివరకు అత్యధికంగా 112 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే స్థాయిలో రంగారెడ్డి జిల్లాలో కూడా 64 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులను చూస్తే ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. ప్రభుత్వం ఎక్కడికక్కడ కరోనాను కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. టెస్టింగ్ కూడా పర్సంటేజ్ ప్రకారం చాలా పెంచారు. కేవలం మంగళవారం ఒక్కరోజే 3,006 టెస్టింగ్ శాంపిల్స్ టెస్ట్ చేశారు. అందులో 879 పాజిటివ్ కేసులు వచ్చాయి. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 63,249 మందికి కరోనా పరీక్షలు చేశారు. 

Read: టీవీలో పరిశ్రమను పట్టిపీడిస్తున్న కరోనా