తెలంగాణలో కరోనాను జయించిన 88 ఏళ్ల వృద్ధుడు

  • Published By: madhu ,Published On : June 19, 2020 / 12:21 AM IST
తెలంగాణలో కరోనాను జయించిన 88 ఏళ్ల వృద్ధుడు

తెలంగాణలో కరోనా విస్తరిస్తోంది. కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. ప్రభుత్వం, అధికారులు వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నా…కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఎప్పుడూ లేని విధంగా 2020, జూన్ 18వ తేదీ గురువారం ఒక్కరోజే..352 మందికి వైరస్ సోకింది.

ఇందులో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లోనే 302 కేసులుండడం గమనార్హం. హైదరాబాద్ నగరంలో వైరస్ ఎలా విస్తరిస్తుందో చెప్పనక్కర్లేదు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 6 వేల 027 కేసులు నమోదు కాగా..195 మంది చనిపోయారు. 3 వేల 301 మంది చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2 వేల 531 మంది చికిత్స  పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో వెల్లడించింది. 

ఇదిలా ఉంటే…88 ఏండ్ల వయోవృద్ధుడు కరోనాతో సాగించిన పోరాటంలో విజయం సాధించాడు. ఇతను పూర్తిగా కోలుకోవడంతో గురువారం డిశ్చార్జ్ చేశారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో నివాసం ఉంటున్నాడు. గత నెల మార్చి 30వ తేదీన నిర్వహించని పరీక్షలో పాజిటివ్ గా తేలింది. దీంతో గాంధీ ఆసుపత్రికి తరలించి..చికిత్స అందించారు. మొత్తం 19 రోజుల పాటు చికిత్స అందించారు డాక్టర్లు. గురువారం మరోసారి పరీక్షలు నిర్వహించగా..పాజిటివ్ గా తేలింది. మరికొన్ని రోజులు హోం క్వారంటైన్ లో ఉండాలని అతనికి వైద్యులు సూచించారు. 

రాష్ట్రంలో కరోనా కేసులు : 
పాజిటవ్ కేసులు 352. మొత్తం 6,027
డిశ్చార్జ్ అయిన వారు : 230. మొత్తం 3,301
మరణాలు : 03. మొత్తం 195
చికిత్స పొందుతున్న వారు : – మొత్తం. 2,531

Read: కరోనా బాధితులకు ప్రభుత్వ రేట్ల ప్రకారమే వైద్యం : మంత్రి ఈటల