కరోనా టెస్టుల కోసం జనాల పరుగులు..ప్రైవేట్ ల్యాబ్స్ కిటకిట

  • Published By: madhu ,Published On : June 25, 2020 / 02:55 AM IST
కరోనా టెస్టుల కోసం జనాల పరుగులు..ప్రైవేట్ ల్యాబ్స్ కిటకిట

దగ్గు, జ్వరం, జలుబు ఉంటే చాలు..టెస్టుల కోసం ప్రైవేట్ ల్యాబ్స్ కు పరుగులు తీస్తున్నారు ప్రజలు. ఎందుకంటే..ఈ లక్షణాలు ఉంటే..కరోనా వ్యాధి అని..వ్యాధులు చెబుతుండడంతో ప్రజల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అసలు అలాంటి లక్షణాలు లేకున్నా..టెస్టులు చేయాలంటూ..ప్రైవేటు ల్యాబ్స్ లను ఆశ్రయిస్తున్నారు.

దీంతో ల్యాబ్స్ లన్నీ జనాలతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రధానంగా GHMCలో వైరస్ వేగంగా విస్తరిస్తోంది. వందలాది కేసులు నమోదవుతున్నాయి. ఏ మాత్రం నలతగా అనిపిస్తే..చాలు..చలో..ప్రైవేటు ల్యాబ్స్ అంటున్నారు. కానీ..ఇక్కడ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షకు డాక్టర్ ధ్రువీకరణ తప్పనిసరి.

ప్రభుత్వం నిర్దేశించిన లక్షణాలుంటేనే..కరోనా పరీక్షకు అర్హులు. చాలామందికి కనీస లక్షణాలే ఉండటం లేదు.  పైగా డాక్టర్‌ ధ్రువీకరణ లేకుండానే పరీక్షలు చేసేస్తున్నారు. కరోనా పరీక్షలు చేయడానికి రాష్ట్రంలో 18 ల్యాబ్ లకు అనుమతినిచ్చింది. 

ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకోవాలంటే కోవిడ్‌–19కు సంబంధించిన కచ్చితమైన లక్షణాలు, ట్రావెల్‌ హిస్టరీ, కోవిడ్‌–19 పేషెంట్‌తో కాంటాక్టయినట్లు స్పష్టమైతేనే అక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలు చేసినా..రిపోర్టులు రావడంలో జాప్యం జరుగుతోంది. దీంతో శాంపిల్స్ ఇచ్చిన వారిలో ఫుల్ టెన్షన్ కు గురవుతున్నారు.

ప్రభుత్వ ల్యాబ్‌లో పరీక్ష ఫలితాల్లో పాజిటివ్‌ ఉంటేనే సదరు వ్యక్తికి సమాచారం ఇస్తున్నారు. నెగిటివ్‌ వస్తే కనీసం ఎస్‌ఎంఎస్‌ కూడా పంపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు ల్యాబ్‌లు సామర్థ్యానికి మించే పరీక్షలు చేస్తున్నారని టాక్. దీంతో ఫలితాల విడుదలలో జాప్యం జరుగుతోంది.

మరోవైపు పరీక్షల విషయంలో ఒక రేటు నిర్ణయించిన సంగతి తెలిసిందే. పరీక్ష చేసేందుకు…రూ. 2 వేల 200, శాంపిల్స్ ను ఇంటి నుంచి తీసుకోవాల్సి వస్తే..రూ. 2 వేల 800 తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అదనంగా రూ. 300 వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. 

Read: TSRTC ఆపరేషన్ సెక్షన్ లో ఆఫీసర్ కు కోవిడ్..ఏపీ – తెలంగాణ మధ్య RTC బస్సులు లేనట్లే !