అప్పుడు మూసీకి వరదలు..ఇప్పుడు కరోనా: రంజాన్ వేళ హైదరాబాద్ వెలవెల..చరిత్రలో రెండోసారి

  • Published By: nagamani ,Published On : May 25, 2020 / 05:29 AM IST
అప్పుడు మూసీకి వరదలు..ఇప్పుడు కరోనా: రంజాన్ వేళ హైదరాబాద్ వెలవెల..చరిత్రలో రెండోసారి

పండుగల సందడి లేదు…పెళ్లిళ్ల హడావిడి లేదు..శుభకార్యాల సందడి లేదు. ఏదీ లేదు. కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ ముస్లిం సోదరుల సందడి లేక చారిత్రాత్మక నగరం హైదరాబాద్ వెలవెలబోతోంది. రంజాన్ అంటే ముస్లిం సోదరులు..హడావిడి అంతా ఇంతా కాదు..షాపింగులతో పాతబస్తీ అంతా రాత్రి సమయంలో కూడా వెలుగు జిలుగులతో కళకళలాడిపోయేది. కానీ కరోనా వేళ హైదరాబాద్ నగరంలో రంజాన్ సందడే లేకుండా పోయింది. ఆఖరికి ముస్లిం సోదరులు ప్రార్థనలకు మసీదులకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. 

దీంతో రంజాన్ పండుగ రోజున కూడా హైదరాబాద్ నగరం  బోసిపోయింది. కరోనా కారణంగా సామూహిక ప్రార్థనలకు ముస్లింలు దూరమై ఎవరి ఇళ్లలో వారు ప్రార్థనలు చేసుకుంటూ నిరాడంబరంగా పండుగ జరుపుకుంటున్నారు.  

రంజాన్ వేళ సామూహిక ప్రార్థనలు నిర్వహించి.. ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకునే ముస్లింలు.. కరోనా మహమ్మారి కారణంగా ఇళ్లలోనే ప్రార్థనలు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడో 112 ఏళ్ల క్రితం మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితి ఉంది. మళ్లీ ఇన్నేళ్లకు కాదు కాదు ఇన్ని దశాబ్దాలకు ఇటువంటి పరిస్థితి వచ్చింది. మూసీ నదికి వరదలు వచ్చిన అప్పట్లో మసీదులు తెరిచి ఉంచినప్పటికీ.. ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకున్నారు. 

1908 సెప్టెంబర్‌ సెప్టెంబర్ లో  మూసీ నదికి భారీగా వరదలు వచ్చాయి. కుండపోత వర్షానికి భారీగా ప్రాణ నష్టం కూడా సంభవించింది. వరద తీవ్రతకు మూసీ నదిపై ఉన్న 3 వంతెనలు సైతం తెగిపోయి..15 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాదిగా ఇళ్లు కూలిపోయాయి. వేలదాదిమంది నిరాశ్రయులయ్యారు. సరిగ్గా అదే సమయంలో రంజాన్ మాసం ప్రారంభమైంది. దీంతో నగరం పరిస్థితి దీనాతిదీనంగా ఉండటంతో హైదరాబాదీ ముస్లిం సోదరులు సమన్వయం పాటించారు. నగరం ఇటువంటి పరిస్థితిలో ఉండగా..రంజాన్ పండుగను ఆడంరంగా జరుపుకోవటం సరికాదనుకున్నారు. దీంతో నిరాడంబరంగా రంజాన్ ను జరుపుకున్నారు.

మళ్లీ ఇన్నేళ్లకు అంటే 112ఏళ్ల తర్వాత రంజాన్  పండుగ షాపింగ్‌లు..వీధుల్లో హలీమ్ ఘుమఘుమలు లేకుండానే రంజాన్ పండుగను జరుపుకోవాల్సి వచ్చింది. రంజాన్ సీజన్లో జనాలతో కిటకిటలాడే చార్మినార్ ప్రాంతాలు బోసిపోయాయి. 

ఒక్క రంజాన్ సీజన్ లోనే రూ.500 కోట్ల వ్యాపారం జరిగేది. లాక్‌డౌన్ దెబ్బకు మార్కెట్లో అమ్మకాలు పాతాళానికి పడిపోయాయి. కోలుకోలేనంతగా లాక్ డౌన్ దెబ్బకొట్టింది. కానీ కాలం అన్నింటికీ సమాధానం చెబుతంది. ఎందుకంటే కాలం అనేది చాలా పెద్ద డాక్టర్. ఎంత పెద్ద వ్యాధులు ప్రభలినా..ఎన్ని వైరస్ లు వచ్చినా..కాల గమనంలో కలిసిపోవాల్సిందే. మనిషి మనుగడ సాగిపోవాల్సిందే. కాబట్టి..బాధపడాల్సిన పనిలేదు. ఏదైనా మన మంచికే అనుకోవాలి. వచ్చే సంవత్సరాం రంజాన్ కళకళలాడుతుంది. భిన్నత్వంలో ఏకత్వం..ఏకత్వంలో భిన్నత్వంగా వెలుగొందే భారత్ మళ్లీ పుంజుకుంటుంది. అన్ని మతాల పండుగలు ఆకాశాన్నంటే సంబురాలతో జరుపుకుంటాం. 

ప్రతీ భారతీయుడే కాదు ప్రపంచంలోనే ప్రతీ మనిషి ఆశావాదిగా ఉండాలి. ఆ ఆశలను..ఆకాంక్షలను నెరవేర్చుకోవటానికి నిత్యం పోరాడాలి. అలాగే కరోనాతో పోరాడాలి. దాన్ని అంతమొందించాలి. మనిషి మనుగడ సాగిపోవాలి.  అభివృద్ధి..అభివృద్ది అంటూ పాకులాడుతూ..ప్రకృతికి హాని చేయకుండా..ప్రతీ మనిషి బాధ్యతనెరిగి మసలుకోవాలి. ఈకరోనాతో నేర్చుకోవాల్సింది అదేనని తెలుసుకోవాలి. 

Read: వరంగల్‌లో 9 మంది డెత్ మిస్టరీ : YouTube చూసి..మర్డర్లకు ప్లాన్