ఫేస్‌బుక్‌తో సరిగమ ఒప్పొందం.. ప్రొఫైల్‌కు పాట పెట్టుకోవచ్చు

  • Published By: vamsi ,Published On : June 4, 2020 / 01:31 AM IST
ఫేస్‌బుక్‌తో సరిగమ ఒప్పొందం.. ప్రొఫైల్‌కు పాట పెట్టుకోవచ్చు

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తన సంగీత ఉత్పత్తుల లైబ్రరీని పెంచడానికి “సరిగమ”తో ప్రపంచ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రస్తుతం 25కి పైగా భాషలలో సినిమా పాటలు, భక్తి సంగీతం, గజల్స్ & ఇండిపాప్ వంటి లక్షకు పైగా పాటలను సారెగమా కలిగి ఉంది. 

ఇందులో ప్రముఖ కళాకారులైన లతా మంగేష్కర్, కిషోర్ కుమార్, మొహమ్మద్ రఫీ, ఆశా భోంస్లే, గుల్జార్, జగ్జిత్ సింగ్, ఆర్డి బర్మన్, కల్యాణజీ ఆనంద్ జీ, గీతా దత్ మరియు లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వంటి సతత హరిత క్లాసిక్స్ ఉన్నాయి.

ఫేస్బుక్ ఇంతకుముందు మార్చిలో టి-సిరీస్, జీ మ్యూజిక్ కంపెనీ, మరియు యష్ రాజ్ ఫిల్మ్స్‌తో సహా భారతదేశంలోని మూడు టాప్ మ్యూజిక్ లేబుళ్ళతో ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పొందంతో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో వీడియోలు, ఇతర సామాజిక అనుభవాల కోసం తమ సంగీతాన్ని వినియోగించుకునేందుకు అంతర్జాతీయ లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సరిగమ వెల్లడించింది. 

ఈ నిర్ణయంతో వినియోగదారులు వీడియోలు, సంగీత స్టిక్కర్ల ద్వారా కథలు, ఇతర సృజనాత్మక కంటెంట్‌ వంటి వారి సామాజిక అనుభవాలను జోడించడానికి అనేక రకాలైన సంగీతాన్ని ఎంచుకోవడానికి అనుమతి లభిస్తుందని సరిగమ వెల్లడించింది. అంతేకాకుండా వినియోగదారులు తమ ఫేస్‌బుక్‌ ఫ్రొఫైల్‌కు పాటల్ని కూడా జోడించే అవకాశం లభిస్తుంది.

Read: PF విత్‌డ్రా చేస్తున్నారా? 3 రోజుల్లోనే అకౌంట్లో డబ్బులు పడతాయి!