ప్రపంచమే ఆశ్చర్యపోయేలా రైతులకు సీఎం కేసీఆర్ చెప్పే తీపి కబురు ఇదేనా

ప్రపంచమే ఆశ్చర్యపోయేలా తెలంగాణ రైతాంగానికి వారం రోజుల్లో తీపి కబురు చెబుతా అంటూ సీఎం కేసీఆర్

  • Published By: naveen ,Published On : May 30, 2020 / 07:56 AM IST
ప్రపంచమే ఆశ్చర్యపోయేలా రైతులకు సీఎం కేసీఆర్ చెప్పే తీపి కబురు ఇదేనా

ప్రపంచమే ఆశ్చర్యపోయేలా తెలంగాణ రైతాంగానికి వారం రోజుల్లో తీపి కబురు చెబుతా అంటూ సీఎం కేసీఆర్

ప్రపంచమే ఆశ్చర్యపోయేలా తెలంగాణ రైతాంగానికి వారం రోజుల్లో తీపి కబురు చెబుతా అంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం దాని గురించే చర్చ నడుస్తోంది. త్వరలో రైతులకు సీఎం కేసీఆర్ చెప్పబోయే ఆ తీపి కబురు ఏంటా అని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా దేశమే అబ్బురపడే ఆ విషయం ఏంటో తెలుసుకోవాలని రైతులు సహా అందరూ ఎదురు చూస్తున్నారు. బంగారు తెలంగాణ, భాగ్యరాశుల తెలంగాణ, పసిడి పంటల తెలంగాణను త్వరలోనే సాకారం చేసుకోబోతున్నాం అంటూ కేసీఆర్ చేసిన ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వ్యవసాయ రంగానికి సంబంధించి సీఎం చేసే ప్రకటన ఏమై ఉంటుంది? ఏ తరహాలో ఉంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

వ్యవసాయాన్ని పండుగగా మార్చాలన్నది లక్ష్యం:
రైతు సంక్షేమ పథకాల అమల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామని అనేక సందర్భాల్లో సీఎం కేసీఆర్ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి రైతుల కోసం ‘సమీకృత రైతు సంక్షేమ పథకం’ను అమలు చేయడం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించిన నూతన వ్యవసాయ విధానంలో భాగంగా ఈ పథకాన్ని అమలు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. పెట్టుబడి మొదలుకుని గిట్టుబాటు దాకా.. అన్నదాతకు అండగా నిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రైతు సంక్షేమం కోసం ఇప్పటికే అమలు చేస్తున్న కార్యక్రమాల(రైతుబంధు, రైతు బీమా, విత్తన సబ్సిడీ, పంట కొనుగోలు)కు మరికొన్నింటిని జోడించి వ్యవసాయాన్ని పండుగగా మార్చాలన్నది కేసీఆర్‌ అంతరంగా తెలుస్తోంది.

ఉచితంగా ఎరువులు, మందులు:
ముఖ్యమంత్రి ఆలోచనలో మొగ్గ తొడిగిన ఈ పథకంలో రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుల మందులను ఉచితంగా అందజేయడం మొదలు పెట్టుబడి సమకూర్చడం, గిట్టుబాటు ధరకు పంటల కొనుగోలు వరకు అన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. వానాకాలం సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా కొత్త పథకానికి తుది రూపు ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లు తాజా సంకేతాలు వెల్లడిస్తున్నాయి. దీని కోసమయ్యే ఆర్థిక అవసరాలపై కూడా ఆయన ఇప్పటికే అవగాహనకు వచ్చినట్లు సమచారం.

సీఎం తీపి కబురులో ఇవి ఉండే చాన్స్:
* పంటల బీమా పథకం ప్రీమియం ప్రభుత్వమే రైతుల పక్షాన చెల్లించడం.
* ప్రకృతి వైపరీత్యాలు, ఇతరత్రా కారణాలతో పంట నష్టం జరిగితే బీమా సంస్థల నుంచి పరిహారం అందించడం.
* నియంత్రిత సాగు విధానంలో భాగంగా సర్కారు ఆదేశాలను పాటించే రైతులకు ఉచితంగా ఎరువులు, విత్తనాల పంపిణీ.
* పంటలు, మద్దతు ధరను వ్యవసాయ సీజన్‌ ప్రారంభానికి ముందే ప్రకటించడం. 
* పంట దిగుబడుల సేకరణపై సీజన్‌ ప్రారంభానికి ముందే రైతులతో ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు ఒప్పందం చేసుకోవడం.
* పంట దిగుబడులకు కేంద్రం ప్రకటించే కనీస మద్దతు ధరకు మరింత ప్రోత్సాహాకాన్ని జత చేసి మార్క్‌ఫెడ్, పౌర సరఫరాల కార్పొరేషన్‌ ద్వారా కొనుగోలు.
* పంట దిగుబడులను కల్లాల దగ్గర నుంచే కొనుగోలు చేయడం. ఉపాధి హామీ పథకం కింద కల్లాల ఏర్పాటుకు రూ.2 లక్షల చొప్పున ఇవ్వడం.
* రైతుబంధు సమితిలను బలోపేతం చేయడంతో పాటు ప్రతీ వ్యవసాయ క్లస్టర్‌లో రైతు వేదికల నిర్మాణం. వీటి కోసం రూ.350 కోట్లు కేటాయింపు.
* ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేసేలా కేంద్రాన్ని ఒప్పించడం.

Read: తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24గంటల్లో 169 కేసులు, 4 మరణాలు