దుమ్మురేపిన మద్యం అమ్మకాలు: రూ. 1,864.95 కోట్ల లిక్కర్ తాగేశారు

  • Published By: madhu ,Published On : June 5, 2020 / 01:12 AM IST
దుమ్మురేపిన మద్యం అమ్మకాలు: రూ. 1,864.95 కోట్ల లిక్కర్ తాగేశారు

తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా తెరుచుకున్న మద్యం షాపులు కళకళలాడుతున్నాయి. మద్యం బాబులు జోరుగా మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ఫలితంగా రాష్ట్ర ఖజాన గలగలమంటోంది. 2020, మే 06వ తేదీన రాష్ట్రంలో వైన్ షాపులు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మే 31 నాటికి..అంటే 26 రోజుల వరకు లెక్కలు తీస్తే..వామ్మో అనిపించేలా ఉన్నాయంట. ఏకంగా రూ. 1, 864.95 కోట్ల విలువైన మద్యం కొనుగోళ్లు జరిగాయని అంచనా. ఇందులో రూ. 800 కోట్లు బీర్లు, రూ. 1000 కోట్ల విలువైన లిక్కర్ ను మద్యం బాబులు కొనుగోలు చేశారంట. అయితే..అందరూ ఊహించినట్లు బీర్ల అమ్మకాలు పెరుగుతాయని భావించినా..అలా జరగలేదు. లిక్కర్ మాత్రం ఎప్పటిలాగానే ఫుల్ జోష్ లో ఉంది. 

వైన్ షాపులు తెరిచిన మొదటి రోజు మే 06వ తేదీన రూ. 72 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి బయటకు వెళ్లింది. నెల ముగిసే సరికి రోజుకు రూ. 71 కోట్ల ఆదాయం లభించింది. పది రోజుల తర్వాత..కొనుగోళ్లు మరింత అధికమయ్యాయి. మే 16వ తేదీన రూ. 100 కోట్లు, మే 26వ తేదీన అత్యధికంగా రూ. 140 కోట్లకు పైగా సరుకు డిపోల నుంచి వైన్ షాపులకు వెళ్లింది. మే నెల చివరి రోజున అత్యధికంగా రూ. 62 కోట్ల మద్యం అమ్ముడయ్యింది. 

మే నెలలో ఎండలు విపరీతంగా ఉండడం..వైన్ షాపులు తెరుచుకోవడంతో బీర్ల అమ్మకాలు ఎక్కువగానే ఉంటాయని అంచనా వేశారు. సాధారణంగా రాష్ట్రంలో లక్ష కేసుల బీర్లు, 1.30 లక్షల కేసుల లిక్కర్ అమ్ముడవుతుంది. మే నెలలో రోజుకు 1.5 లక్షలకు పైగా సగటున 50 లక్షల కేసుల బీర్ అమ్ముడవుతుంది. కానీ అలా జరగలేదు. రోజుకు సగటున అమ్ముడైన బీర్ కేసుల సంఖ్య 90 వేలు మాత్రమే. 

Read: తెలంగాణ హోం క్వారంటైన్ గైడ్ లైన్స్ : ఇంట్లో ఎలా ఉండాలి..వ్యాధి వస్తే ఏం చేయాలి