2020 ఫోర్బ్స్ క్రీడాకారుల జాబితాలో భారతీయుడు కోహ్లీ ఒక్కడే. రూ.188కోట్ల సంపాదన

  • Published By: srihari ,Published On : May 30, 2020 / 09:45 AM IST
2020 ఫోర్బ్స్ క్రీడాకారుల జాబితాలో భారతీయుడు కోహ్లీ ఒక్కడే. రూ.188కోట్ల సంపాదన

కోహ్లీకి జీతం కన్నా గీతం ఎక్కువ. మ్యాచ్‌లాడి రెండుమిలియన్ డాలర్లు సంపాదిస్తే, 24మిలియన్ డాలర్లను యాడ్స్ రూపంలో వెనుకేశాడు. ఈ క్రికెట్ సూపర్ స్టార్ Forbes’ list of world’s highest-paid athletesలో 100 స్థానం నుంచి 66కి ఎగబాకాడు. మొత్తంమీద కోహ్లీ మిగిలిన క్రీడాకారులకు అసూయపుట్టే రీతిలో సంపాదించాడు. మొత్తం 26 మిలియన్ డాలర్లు.  ఇందులో ఎండోర్స్‌మెంట్‌ల ద్వారానే ఎక్కువమొత్తాన్ని సంపాదించాడు. భారతదేశంలో ఏ క్రీడాకారుడూ కోహ్లీకి దరిదాపుల్లో లేడు.

టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ తొలిసారి ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. లేటువయస్సులో 106.3 మిలియన్ డాలర్లను సంపాదించి, కిందటి యేడు 5వ స్థానం నుంచి ఏకంగా ఫస్ట్ ప్లేస్‌కే చేరాడు. ఎప్పుడూ ఫోర్బ్స్‌లిస్ట్ లో ముందుండే ఫుట్‌బాల్ ఆటగాళ్లు కాస్త వెనుకబడ్డారు. క్రిస్టియానో రొనాల్డో 105 మిలియన్ డాలర్లు సంపాదిస్తే, ఒక్క మిలియన్ డాలర్లు తక్కువ సంపాదించిన మెస్సీ మూడోస్థానంలో నిలిచాడు. నాలుగోస్థానంకూడా ఫుల్ బాల్ క్రీడాకారుడిదే. బ్రెజిల్ ఆటగాడు నెమార్ నిలిచాడు. నిజానికి 100మిలియన్ డాలర్ల ఆదాయం రొనాల్డో లాంటి ఆటగాడికి చాలా తక్కువ. కోవిడ్ దెబ్బకు టోర్నమెంట్లు ఆగిపోవడంతో కొద్దిమొత్తంతోనే సరిపెట్టుకున్నారు.

Read:పోర్న్ వీడియోలకు లైక్ కొట్టిన ప్రముఖ మాజీ క్రికెటర్, అసలేం జరిగిందంటే..??