లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

కొవిడ్-19ను ముందుగానే పసిగడుతున్న స్మార్ట్ వాచ్‌లు

Published

on

కొవిడ్-19 టెస్టు చేయించుకోకముందే స్మార్ట్ వాచ్ పెట్టుకోగానే లక్షణాలు ఇట్టే తెలిసిపోతాయట. మౌంట్ సినైలోని ఐకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ రీసెర్చర్స్ టీం ఈ విషయాన్ని వెల్లడించింది. 297మంది హెల్త్ వర్కర్ల యాపిల్ వాచెస్ డేటానే విషయాన్ని స్పష్టం చేసిందని అంటున్నారు.

కొవిడ్-19 ప్రాథమిక లక్షణాల్లో భాగంగా శరీరంలో ఇన్ఫెక్ట్ అయిన ఏరియాల్లో కాస్త మంటగా ఉంటాయట. రక్త సరఫరా జరుగుతున్న కొద్దీ అందులో మార్పులు ఉంటాయి. వ్యక్తి హార్ట్ బీట్ మారుతున్న కొద్దీ రక్త సరఫరాలో కూడా మార్పులు రావొచ్చు. ఈ విషయాన్ని యాపిల్ స్మార్ట్ వాచ్ ఇట్టే పసిగట్టేస్తుంది.

రెగ్యూలర్ గా ఉండే హార్ట్ బీట్ లో వచ్చే మార్పులను పసిగట్టేందుకు హెల్త్ కేర్ వర్కర్లకు యాపిల్ వాచ్ లు పెట్టుకోమని సూచించారు. దానిద్వారా వారి హార్ట్ బీట్ లో మార్పులు గమనించారు. ఈ వాచ్ లు 2/3వ వంతు మందిలో ఇన్ఫెక్షన్ ను కరెక్ట్ గా కనిపెట్టింది. లక్షణాలు ఉన్న వ్యక్తుల్లో కనీసం ఏడు రోజుల ముందే ఇన్ఫెక్షన్ సోకిన వారు ఉన్నారు.

స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో జరిపిన మరో స్టడీలో స్మార్ట్ వాచెస్ సరిగ్గానే పనిచేస్తున్నాయా అనేది విషయాన్ని కనుగొన్నారు. వారిలో చాలా మంది నుంచి వచ్చిన సమాధానం అవుననే. సాధారణ లక్షణాలు బయటపడటానికి ఏడు రోజుల ముందే ఈ వాచ్ లు చెప్పేస్తున్నాయి. అప్పటి వరకూ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండని వారు కూడా ఆప్షన్ తీసుకుంటున్నారు.

ప్రస్తుత కరోనా మహమ్మారి వ్యాప్తి నెమ్మెది అయినా.. భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం మరింత ఈజీ అవుతుంది.