లెక్కల్లో సూపర్ ఫాస్ట్ స్మోకర్లే త్వరగా స్మోకింగ్ వదిలేస్తారు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

లెక్కల్లో బెటర్ గా ఉండే స్మోకర్లే స్మోకింగ్ ను వదిలేయగలరని ఓ స్టీ చెబుతోంది. స్మోకర్లలో మ్యాథ్స్ టెస్ట్ ఎక్కువ స్కోర్ చేసిన వాళ్లే.. ఇతరుల కంటే త్వరగా సిగరెట్ స్మోకింగ్ కు గుడ్ బై చెప్పేయగలరని తేలింది.’మ్యాథ్స్ స్కిల్స్ బెటర్ గా ఉన్న వాళ్లే స్మోకింగ్ వల్ల వచ్చే రిస్క్ ల గురించి భయపడుతూ ఉంటారని.. అలాగే స్మోకింగ్ మానేస్తారని తెలిసింది’ అని బ్రిటనీ షూట్స్ రీన్ హార్ అన్నారు. ఓహియో స్టేట్ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్ అయిన రీన్ హర్డ్ ఆధ్వర్యంలో స్టడీ నిర్వహించారు.ఈ ఫలితాల కారణంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ స్మోకింగ్ ను త్వరగా వదిలేశారని స్పష్టమైంది. జర్నల్ హెల్త్ సైకాలజీ జర్నల్లో పబ్లిష్ అయిన స్టడీలో వివరాలిలా ఉన్నాయి. 696మంది అడల్ట్ స్మోకర్లపై యునైటెడ్ స్టేట్స్ లో ఇది జరిగింది. సెషన్ ఆరంభంలో పార్టిసిపెంట్స్ కు మ్యాథ్స్ టెస్ట్ ఒకటి నిర్వహించారు. వారందరికీ ఎనిమిది రకాలైన వార్నింగ్ లేబుల్స్ చూపించారు. ఒక్కోటి నాలుగు సార్లు చూపించారు.వార్నింగ్ లేబుల్లో పలు రకాలైన ఇమేజ్ లు ఉన్నాయి. ఊపిరితిత్తులు పాడైపోయి, సమాధుల్లాంటి బొమ్మలు ఉన్నాయి. దాంతో పాటుగా ప్రతీ లేబుల్ మీద స్మోకింగ్ మీ ప్రాణాలను హరిస్తుందని ఉంది. ఉదహరణకు నాన్ స్మోకర్లతో పోలిస్తే 75.4 శాతం మంది స్మోకర్లు 85ఏళ్ల కంటే ముందు చనిపోవచ్చు. అదే సంఖ్య నాన్ స్మోకర్లలో 53.7శాతంగా ఉంది. పలు సందర్భాల్లో లేబుల్ పై పార్టిసిపెంట్స్ ఎమోషనల్ రియాక్షన్స్ గురించి అడిగారు. ఒక్కో లేబుల్ పై పర్సనల్ రిలెవన్స్ ఉంది.ప్రయోగం జరిగిన ఆరు వారాల తర్వాత పార్టిసిపెంట్స్ ముందు పలు రకాల టెస్టులు చేశారు. అందులో స్మోకింగ్ రిస్క్ ల గురించి ప్రశ్నలు ఉన్నాయి. ఎంతవరకూ గుర్తుపెట్టుకున్నారనే దానిని పరీక్షించారు. రాబోయే 30 రోజులు లేదా సంవత్సరంలో స్మోకింగ్ మానేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు.స్మోకర్లకు ఎవరికైతే సూపర్ అఫీషియల్ నాలెడ్జ్ ఉన్న వారే హెల్త్ రిస్క్ ల గురించి అప్రమత్తమవుతున్నారు. ఇక్కడ మాకు అర్థమైందేంటంటే న్యూమరికల్ గా ఎవరైతే బెటర్ గా ఉన్నారో.. వారే మిగిలిన వారి కంటే జాగ్రత్తగా ఉంటున్నారు.

Related Posts