చెన్నై విమానాశ్రయంలో రూ.1.64 కోట్ల బంగారం స్వాధీనం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Gold smuggling at Chennai airport : చెన్నై విమనాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీలు ముమ్మరం కావటంతో దుబాయ్ నుంచి వచ్చిన విమాన ప్రయాణికులు తాము స్మగ్లింగ్ చేస్తూ తీసుకువచ్చిన బంగారాన్ని విమానంలో సీట్ల వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. గత రెండు రోజులుగా దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద నుంచి రూ. 1కోటి.64 లక్షల విలువగల మూడు కిలోల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

గత రెండు రోజులుగా దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులు అరెస్టుల భయంతో విమానాల్లోని వారి సీట్ల వద్ద వదిలి వేసిన బంగారం బిస్కెట్లను తాము స్వాధీనం చేసుకున్నామని కస్టమ్ అధికారులు చెప్పారు. దుబాయ్ నుంచి వచ్చిన కొందరు ప్రయాణికులు స్మగ్లింగ్ బంగారం విమానంలో వదిలివెళ్లారని తేలిందని కస్టమ్ అధికారులు వివరించారు.అలాగే మంగళ, బుధవారాల్లో కూడా కొందరు ప్రయాణికుల నుంచి పేస్టు రూపంలో దుబాయ్ నుంచి తీసుకువచ్చిన బంగారాన్ని కస్టమ్ అధికారులు సీజ్ చేశారు. ఈ బంగారం స్మగ్లింగ్ కేసులో ఇప్పటివరకు ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశామని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని కస్టమ్స్ అధికారులు చెప్పారు.

 

Related Tags :

Related Posts :