లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-1

Snake Rescue : చీర కట్టి పామును పట్టేసిన మహిళ, video viral

Published

on

పాముులు పట్టేది కేవలం మగవారేనా..మహిళలు పట్టుకోలేరా ? అంటోంది ఓ మహిళ. చీర ధరించి మరి పామును పట్టేస్తున్న ఈ మహిళకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. స్నేక్ క్యాచర్స్ లో ఎక్కువగా పురుషులు ఉంటారనే సంగతి తెలిసిందే.ఎక్కడైనా పాము ఉందని సమాచారం వస్తే..ఠక్కున అక్కడ వాలిపోయి..చాకచక్యంగా పాములను పట్టుకుని వెళుతుంటారు. కానీ…చీరకట్టులో అలవోకగా..పాములను పట్టేస్తోంది.
నిర్జరా చిట్టి కర్నాటక రాష్ట్రంలో బెల్గాంలో నివాసం ఉంటున్నారు. ఈమె స్నేక్ క్యాచర్. భర్త..కూడ పాములను అలవోకగా పట్టుకుంటాడు.


వైరల్ ఫోటో: కియారా అద్వానీని ముద్దు పెట్టుకున్న సుశాంత్ సింగ్


బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి అందంగా ముస్తాబై వెళ్లింది చిట్టి. ఓ ప్రాంతంలో పాము ఉందని చిట్టీకి ఫోన్ చేశారు. వెంటనే అక్కడకు వెళ్లింది. ఆ సమయంలో ఆమె దగ్గర ఎలాంటి పరికరాలు లేవు. ధైర్యం చేసింది. ఓ కర్ర సహయంతో పామును పట్టుకుని బ్యాగులో వేసింది. ఈ సమయంలో ఆమె చీర ధరించి ఉంది.కొన్ని సమయాల్లో చీర వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాం. కానీ..ఈ రోజు తప్పలేదు అంటోంది చిట్టి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హాట్సాఫ్ చిట్టి అంటున్నారు నెటిజన్లు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *