లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

సీఎం జగన్‌ను కొందరు మిస్ లీడ్ చేస్తున్నారు

Published

on

Some are misleading CM Jagan says mla roja : నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోసారి ఆవేదన వెళ్లగక్కారు. నగరి నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్‌గా తయారుచేసేందుకు ఏడాదిగా కష్టపడుతున్నానని చెప్పారు. అయినప్పటికీ.. ఈ విషయంలో సీఎం జగన్‌ను కొందరు మిస్ లీడ్ చేయడం ఆవేదన కలిగిస్తోందన్నారు. అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్‌కు అనేక అర్జీలు పెడుతున్నానని తెలిపారు. ఓ ఎమ్మెల్యేగా బాధ్యతగా ముందుకెళ్తున్నానని చెప్పారు. తన ఆవేదనపై టీడీపీ నేతలు వెటకారంగా మాట్లాడటం బాధాకరంగా ఉందన్నారు.

తనను ఎవ్వరూ పట్టించుకోవట్లేదనీ, పార్టీ కార్యక్రమాలకు ఎవ్వరూ పిలవట్లేదని ఇటీవలే ఎమ్మెల్యే రోజా కన్నీంటిపర్యంతమయ్యారు. ఏపీ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. కలెక్టర్ సహా ఎవరూ తనను పట్టించుకోవడం లేదని నియోజకవర్గ సమస్యలు, ప్రోటోకాల్ విషయంలో అధికారుల తీరుపై కమిటీకి ఫిర్యాదు చేశారు. తనకు కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నగరిలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల సమావేశానికి తనను ఆహ్వానించలేదని.. అధికారులు తనకు తెలియకుండా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని..ఓ ఎమ్మెల్యేగా ఇది నాకు అవమానమని ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ప్రివిలేజ్ కమిటీ ముందే ఎమ్మెల్యే రోజా కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.