కరోనా వైరస్‌పై ఫైట్ చేయాల్సిన ఆటోయాంటీబాడీల రివర్స్ ఎటాక్!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

autoantibodies : కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారిలో చాలామందిలో ఆటోయాంటీ బాడీలు తయారవుతున్నాయంట.. అవి వైరస్‌పై పోరాడాల్సింది బోయి వారి రోగనిరోధక వ్యవస్థపైనే దాడి చేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ వారి శరీరంలో రోగ నిరోధకత క్షీణించి కీళ్ల వాతం, చర్మవ్యాధులకు దారితీస్తుందని ఓ కొత్త అధ్యయనంలో తేలింది.కరోనా తర్వాత దీర్ఘకాలిక లక్షణాలతో బాధపడటానికి ఈ ఆటోయాంటీ బాడీ కణాలే కారణమని జార్జియాలోని అట్లాంటా, ఎమోరి యూనివర్శిటీ నిపుణులు వెల్లడించారు. కరోనా బాధితుల్లో ప్రస్తుతం ఆటోయాంటీబాడీలు ఉంటే వారిలో ఇమ్యూనిటీని బలహీనపరుస్తాయని చెబుతున్నారు.

అంతేకాదు.. ఇలాంటి వారిలో దీర్ఘకాలం పాటు కరోనా నుంచి కోలుకోవడం కష్టమేనని అంటున్నారు. కరోనా బాధితుల్లో ఆటోయాంటీ బాడీలు ఉన్నాయో లేదో పరీక్ష ద్వారా నిర్ధారణ చేసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే లక్షణాలకు తగిన చికిత్స తీసుకునేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కరోనా బాధితుల నుంచి 52 రక్త పరీక్షలను చేసినట్టు నిపుణులు తెలిపారు.వీరిలో 44 శాతం మందిలో ఆటోయాంటీ బాడీలు ఉన్నాయిని ఫలితాల్లో వెల్లడైంది. హ్యుమన్ DNAను కూడా దెబ్బతీసినట్టు గుర్తించారు. ఆటో యాంటీబాడీలతో జబ్బు పడిన వారిలో 70శాతానికి పైగా ఇమ్యూనిటీ సెల్స్ దెబ్బతిన్నాయని తేలింది.

చాలామంది పేషెంట్లలోనూ యాంటీబాడీలు ఉన్నాయి. న్యూట్రలైజ్ ప్రొటిన్లు ఆరోగ్యకరంగా రక్తం గడ్డకట్టడంలో సాయపడుతుంటాయి. దీర్ఘకాలిక కరోనా లక్షణాలతో బాధపడేవారిలో బొటనవేలిపై బొడిపెలతో పాటు మంటగా అనిపించడం, గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని నిపుణులు వెల్లడించారు.మొదట కరోనా వైరస్ సోకిన తర్వాత కొన్ని నెలల వ్యవధిలో బాధితుల్లో ఇమ్యూనిటీ కోల్పోయినట్టు గుర్తించారు. వారిలో యాంటీబాడీలు కూడా తగ్గిపోయాయని తెలిపారు. ఆటోయాంటీబాడీలన్నీ యాంటీబాడీలు మారి రోగనిరోధక శక్తిని ఫైట్ చేసేలా చేస్తాయి. శరీరంలో B కణాలు తయారుచేసిన యాంటీబాడీలు ఇమ్యూనిటీ ప్రొటీన్లుగా ఉంటాయి.కరోనా వంటి కొత్త వైరస్‌లను శరీరంలోకి ప్రవేశించిన వెంటనే ఈ యాంటీబాడీలు తయారవుతాయి. జెనటిక్ కోడ్ వెంటనే రియాక్ట్ అయి B సెల్స్‌ ను ఫైట్ చేసేందుకు సన్నద్ధం చేస్తుంది. కానీ, కొన్నిసార్లు ఈ వ్యవస్థ హ్యుమన్ జనటిక్ కోడ్‌ను తప్పుగా గుర్తించే అవకాశం ఉంది. ఇలా జరిగినప్పుడు వైరస్ పై ఫైట్ చేయాల్సిన యాంటీబాడీలు శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ పై దాడి చేసే అవకాశం ఉంటుంది.

Related Tags :

Related Posts :