సోము వీర్రాజుకు మెగాసపోర్ట్! : నిన్న చిరంజీవి..నేడు పవన్ తో భేటీలు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులు కావడం..ఢిల్లీకి వెళ్లి వచ్చి..పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత..స్పీడు పెంచారు. ఎవరూ ఊహంచని విధంగా రాజకీయాలు చేస్తుండడం హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంతో పొలిటికల్ గరంగరంగా ఉన్నాయి. ఈ క్రమంలో…సోము వీర్రాజు పార్టీల నేతలను కలుస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.రాజకీయాలకు దూరంగా ఉంటూ..సినిమాలపై ఫోకస్ పెట్టిన ‘చిరంజీవి’ని సోము..కలవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. వీరద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. రాజకీయ పార్టీ స్థాపించి రాజకీయాల్లో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎందుకు కలవలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.

ఈ డౌట్స్ ను కూడ సోము తీర్చేశారు. 2020, ఆగస్టు 07వ తేదీ శుక్రవారం సోము..నేరుగా హైదరాబాద్ లో ఉన్న పవన్ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా సోమును శాలువతో పవన్ సత్కరించారు. రెండు రోజుల్లో మెగ బ్రదర్స్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం మర్యాదపూర్వకంగా భేటీలు అని బీజేపీ వెల్లడిస్తోంది.కానీ సమ్ థింగ్ ఏమో ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాపు సామాజిక వర్గాన్న ఒక్కతాటిపైకి తేవాలని ప్రయత్నంలో భాగంగా సోము వీర్రాజు వర్కవుట్ చేస్తున్నారని, అందులో భాగంగా భేటీలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.

చిరంజీవి రాజకీయాలను పక్కన పెట్టి..సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే సినిమాలు విడుదలయ్యాయి కూడా. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్ లు ఆగిపోయాయి. అటు తెలంగాణ, ఇటు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రులతో టాలీవుడ్ పెద్దలు భేటీ అయ్యారు. ఇక్కడ చిరంజీవి లీడ్ పాత్ర పోషించారు. టాలీవుడ్ లో ఏదైనా సమస్య వచ్చినా..పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు చిరంజీవి.ఏపీలో కాపు సామాజికవర్గం బలంగా..ఉండడం..వీరిని ఒకే తాటిపైకి తెస్తే లాభం ఉంటుందని బీజేపీ భావిస్తోందని సమాచారం. ఇందులో భాగంగానే సోము వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. 2024 టార్గెట్ గా బీజేపీ – జనసేనలు పని చేస్తాయని సోము అంటున్నారు. ఈ నేపథ్యంలో తన సామాజికవర్గంలో పట్టు సాధించుకొనేందుకు చిరంజీవి, పవన్ భేటీల ద్వారా ఓ సంకేతాన్ని పంపేందుకు సోము ప్లాన్ వేశారని అనుకుంటున్నారు.

మొత్తానికి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. మరి ఏపీలో బీజేపీ పట్టు సాధించేందుకు సోము వీర్రాజు చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా ? లేదా ? అనేది చూడాలి.

READ  పవన్ కళ్యాణ్ కదలికలపై నిఘా : జనసేన ఆఫీసు వద్ద పోలీసుల మోహరింపు

Related Posts