లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఉభయపార్టీల అభ్యర్థి విజయమే లక్ష్యం

Published

on

Somuveerraju meets Pawan Kalyan : బీజేపీ, జనసేన ఉభయపార్టీల అభ్యర్థి విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు చెప్పారు. ఆదివారం హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఆయన భేటీ అయ్యారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి, ఏపీలో రాజకీయ పరిస్థితులపై చర్చించామని తెలిపారు. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక అభ్యర్థిపై చర్చించామని పేర్కొన్నారు.

2024లో బీజేపీ, జనసేన సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యమన్నారు. తిరుపతి ఉపఎన్నికే పునాదిగా భావిస్తున్నామని తెలిపారు. కుల, మత బేధాలు లేకుండా కలిసి పనిచేస్తామని చెప్పారు. సమన్వయ లోపం లేకుండా ముందకు వెళ్లేలా చర్చించామని తెలిపారు.