తల్లి వాట్సాప్ స్టేటస్ తో కొడుకు జైలు పాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఓ మహిళ వాట్సాప్‌ స్టేటస్‌ ఆమె కొడుకు జైలు పాలు కావడానికి కారణమైంది. 15 నెలల క్రితం నమోదైన ఒక జ్యూవెలరీ కేసును చేధించడంలో వాట్సాప్‌ స్టేటస్‌ ఉపయోగపడింది. ఈ సంఘటన హైదరాబాద్‌ రాచకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. జూలై 12, 2019లో సాయి​కిరణ్‌ అనే వ్యక్తి గుడికి వెళ్లి ఇంటికి వచ్చేసరికి అతని ఇంటి తలుపులు తెరచి ఉన్నాయి.తాళం వేయడం మర్చిపోయానేమో అనుకుంటూ లోపలికి వెళ్లిన ఆ వ్యక్తి తన ఇంట్లో బంగారం దొంగిలించినట్లు కనుగొన్నారు. తన ఇంట్లో చోరి జరిగినట్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇక ఇన్ని రోజుల తరువాత వారి ఇంటి పక్కన ఉండే మహిళ కిరణ్‌ వాళ్ల ఇంట్లో దొంగిలించిన నగను పెట్టుకొని ఉన్న ఫోటోను వాట్సాప్‌ ద్వారా షేర్‌ చేసింది.ఇది చూసిన కిరణ్‌ ఆ నగ తమ ఇంట్లో దొంగిలించిదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేయగా ఆమె కొడుకు జితేందర్‌ ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ విషయం అతని తల్లికి తెలిసే జరిగిందని పోలీసులు ఆమెకు కూడా నోటీసులు జారి చేశారు.

Related Tags :

Related Posts :