లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

పబ్‌జీ ఆడొద్దన్నందుకు తండ్రిని చంపాడు

కర్ణాటకలో పబ్‌జీ గేమ్‌కు బానిసైన ఓ యువకుడు ఏకంగా కన్నతండ్రినే కడతేర్చాడు. తండ్రిని కత్తిపీటతో ముక్కలు ముక్కలుగా నరికి కిరాతకంగా చంపాడు.

Published

on

son killed his father for not playing Pabji

కర్ణాటకలో పబ్‌జీ గేమ్‌కు బానిసైన ఓ యువకుడు ఏకంగా కన్నతండ్రినే కడతేర్చాడు. తండ్రిని కత్తిపీటతో ముక్కలు ముక్కలుగా నరికి కిరాతకంగా చంపాడు.

కర్ణాటకలో పబ్‌జీ గేమ్‌కు బానిసైన ఓ యువకుడు ఏకంగా కన్నతండ్రినే కడతేర్చాడు. తండ్రిని కత్తిపీటతో ముక్కలు ముక్కలుగా నరికి కిరాతకంగా చంపాడు. బెళగావికి చెందిన 25 ఏళ్ల రఘువీర్‌ కమ్మార ఐటీఐ మెకానికల్‌ చదువుతున్నాడు. మొబైల్‌ గేమ్స్‌కు అలవాటుపడ్డ రఘువీరా- గత శనివారం నుంచి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అర్థరాత్రి ఆరుబయటకు రావడం, ఇతరుల ఇంటి తలుపులు, కిటికీలు కొడుతూ తనకు రక్తం కావాలని స్థానికులను భయబ్రాంతులకు గురిచేసేవాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు మరుసటిరోజు రఘువీరాతో పాటు అతని తల్లిదండ్రులను పిలిపించి వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి హెచ్చరించి వదిలేశారు.

అయినా కూడా రఘువీర్‌లో మార్పు రాలేదు. అదేరోజు ఆదివారం అర్ధరాత్రి వరకు పబ్‌జీ గేమ్‌ ఆడుతూనే ఉన్నాడు. అతడి చేతికి రక్తం వస్తుండడం చూసి కట్టుకట్టబోయిన తల్లితో తనని ఎందు డిస్టర్బ్‌ చేస్తున్నావని గొడవ పడ్డాడు. ఇదంతా గమనించిన  తండ్రి కొడుకును గట్టిగా పట్టుకుని కట్టుకట్టబోగా ఒక్కసారిగా ఉన్మాదిగా మారాడు. తల్లిని ఓ గదిలో బంధించిన రఘు… కత్తిపీటతో తండ్రిపై దాడి చేయడంతో 60 ఏళ్ల వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అంతటితో ఆగని రఘువీర్- తండ్రి మొండాన్ని, తలను వేర్వేరుగా చేశాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులపై కూడా దాడికి యత్నించగా…చాకచక్యంగా వ్యవహరించి రఘువీర్‌ను అరెస్ట్‌ చేశారు.

ఆన్‌లైన్స్‌ గేమ్స్‌ యువతను పెడదారి పట్టిస్తున్నాయి. పబ్‌జీ లాంటి గేమ్స్ వారిని ఉన్మాదులుగా మారేలా చేస్తున్నాయి. ఈ అలవాటును మొగ్గలోనే తుంచకుంటే యువత బానిసలుగా మారే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి హింసాత్మక ఆటలను  నిషేధించాలని పేరెంట్స్, పలువురు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం అంతగా స్పందించడం లేదు.

Also Read : కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించం

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *