son-murdered-father-extra-marital-affair-with-his-wife-tamilnadu1

కోడలితో అక్రమ సంబంధం…..హత్య చేసిన కొడుకు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కూతురులా చూసుకోవాల్సిన కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఓ మావగారు. విషయం తెలిసిన కొడుకు, మానుకోమని తండ్రిని హెచ్చరించాడు. మాట వినకపోవటంతో కన్నతండ్రని కూడా చూడకుండా కిరాతకంగా హత్య చేశాడు. తమిళనాడులోని ధర్మపురి జిల్లా కృష్ణాపురంలో ఈ దారుణం జరిగింది.

కృష్ణాపురం లోని ఎంకే నగర్ లో నివసించే మునియప్పన్ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు చేసేశాడు. కొద్దికాలం క్రితం భార్య మరణించటంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. అదే ప్రాంతంలో అతని నాలుగో కొడుకు వేలన్(45) భార్య మల్లికా(40) పిల్లలతో నివసిస్తున్నాడు.

మునియప్పన్, కొడుకు వేలన్ ఇంటికి వచ్చి పోయే క్రమంలో కోడలు మల్లికా తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భర్తకు తెలియకుండా మామ కోడళ్లు అవకాశం ఉన్నప్పుడల్లా శృంగారంలో మునిగి తేలుతున్నారు. కొన్నాళ్ళకు ఈ వ్యవహారం వేలన్ కు తెలిసి పోయింది. ఈ వ్యవహారం మానుకోమని తండ్రికి చెప్పాడు. అయినా అతను వినలేదు. కోడలితో అక్రమ సంబంధం కొనసాగిస్తూనే ఉన్నాడు.

శుక్రవారం జులై 24 వ తేదీ రాత్రి ఫుల్ గా మద్యం సేవించాడు. తండ్రి ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో నిద్రపోతున్న తండ్రి మునియప్పన్ పై బండరాయివేసి హత్య చేశాడు. తండ్రి మరణించాడని ధృవ పరుచుకున్నతర్వాత ఇంటికి వెళ్లిపోయాడు. తండ్రిని హత్య చేసిన సంగతి శనివారం తనసోదరుడికి చెప్పాడు.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వేలన్ ను అరెస్టు చేశారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే తండ్రిని హత్య చేసినట్లు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో వేలన్ ఒప్పుకున్నాడు. కేసు దర్యాప్తులో ఉంది.

 

Related Posts