తండ్రి బహుమతిగా ఇచ్చిన మద్యం బాటిళ్లు అమ్మి, ఇల్లు కొనుక్కున్న యువకుడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రతి ఏటా తన పుట్టిన రోజుకు తండ్రి ఇచ్చే విస్కీ బాటిల్ దాచి పెట్టి 28ఏళ్ల తర్వాత వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో ఇల్లు కొనుకున్నాడో యువకుడు. ఇంగ్లాండ్ లోని టౌంటన్ కు చెందిన మాథ్యూ రాబ్సన్ అనే యువకుడు 1992 లో జన్మించాడు. అతని తండ్రి పీట్ ప్రతి ఏటా మాథ్యూ పుట్టిన రోజుకు మాకల్లన్ బ్రాండ్ సింగిల్ మాల్ట్ విస్కీ ని బహుమతిగా ఇస్తూ ఉండేవాడు.
dram house englandబహుమతిగా ఇస్తూ… వాటిని ఎప్పుడూ తెరిచి వాడవద్దని తండ్రి హెచ్చరించేవాడు. కొన్నాళ్లకు అవే బంగారు బాతుగుడ్లు అవుతాయని చెప్పేవాడు. నాకు మద్యం తాగే వయస్సులేనందున నా తండ్రి మాకల్లన్ విస్కీ బాటిల్ గిఫ్ట్ గా ఇవ్వటం వింతగా అనిపించేది.

lifetime-collection
మా నాన్నచెప్పినట్లు నేను ఏరోజు వాటిని ఉపయోగించలేదు. గడిచిన 28 ఏళ్ల కాలంలో నా తండ్రి వాటికోసం ఖర్చు చేసింది కేవలం 5 వేల పౌండ్లు మాత్రమే.కానీ ఇప్పుడు వాటిని అమ్మగా 40వేల పౌండ్లు కంటే ఎక్కువ వస్తోంది. ఆ డబ్బుతో మథ్యూ ఒక ఇంటివి కోనుగోలుచేయచానికి వెచ్చిస్తున్నానని చెప్పాడు. 

macallan whisky 1

వీటిని విస్కీ బ్రోకర్ మార్క్ లిట్లర్ విక్రయిస్తున్నాడు. మాథ్యూ వద్ద వున్న మాకల్లన్ విస్కీ బాటిల్స్ పర్ ఫెక్ట్ సెట్ అని అభివర్ణించాడు.గత 5,10 సంవత్సరాల్లో మాకల్లన్ విలువ భారీగా పెరిగిందని ఇంతకాలం నిల్వ ఉన్న విలువైన మద్యం దొరకటం చాలా అదృష్టమని ఆయన అన్నాడు.

పాతకాలం నాటి మద్యానికి ఇప్పటికీ న్యూయార్క్ ఆసియాదేశాలనుంచి కొనుగోలుదారలు ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పారు.

 

Related Posts