లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

వీడియో గేమ్ ఆడొద్దని తల్లి మందలించిందని 14ఏళ్ల కొడుకు ఆత్మహత్య

Published

on

son suicide: తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం కడలిలో విషాదం చోటు చేసుకుంది. తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రసాద్(14) అనే బాలుడు చెరువులో దూకి చనిపోయాడు. లాక్ డౌన్ లో ఇంటికే పరిమితం అయిన ప్రసాద్.. ఫ్రీ ఫైర్ అనే గేమ్ ఆడటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత దానికి బానిస అయ్యాడు. 24 గంటలూ అదే పనిగా పెట్టుకున్నాడు. దీంతో ప్రసాద్ ను తల్లి మందలించింది. వీడియో గేమ్ ఆడొద్దని చెప్పింది. తల్లి మందలించడంతో ప్రసాద్ మనస్తాపం చెందాడు. చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రసాద్ ఇక లేడు అనే వార్త తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

రాజోలు మండలం కడలిలో ఆన్‌లైన్ గేమ్ అడిక్షన్ ఎనిమిదో తరగతి విద్యార్థి ప్రాణాలు తీసింది. వీడియో గేమ్‌ ఆడొద్దని తల్లి మందలించడంతో.. ఏమనుకున్నాడో ఏమో.. ఆ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు.

కడలికి చెందిన అప్పారి ప్రసాద్‌.. లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్ వీడియో గేమ్స్‌కు అడిక్ట్ అయ్యాడు. తల్లి మొబైల్‌లో ఫ్రీ ఫైర్‌ గేమ్‌ ఆడేవాడు. ఐదు నెలలుగా వీడియో గేమ్స్‌తోనే కాలక్షేపం చేస్తూ వచ్చాడు. అయితే 10 రోజుల క్రితం ప్రసాద్‌ను మందలించిన తల్లి.. అతడి నుంచి సెల్‌ఫోన్‌ను లాక్కుంది. తల్లి మందలించడంతో పాటు.. సెల్‌ఫోన్‌ లాక్కోవడంతో.. మనస్తాపానికి గురైన ప్రసాద్‌.. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

తల్లి మందలించి ఫోన్ ఇవ్వడం లేదనే కోపంతో.. 8వ తరగతి చదువుతున్న ప్రసాద్ చెరువులోకి దూకి ప్రసాద్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కన్నవారికి తీరని కడుపు కోత మిగిల్చాడు. ఇక ఈ ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలా?
ప్రసాద్ చేసిన పని కుటుంబసభ్యులనే కాదు స్థానికులను కూడా విస్మయానికి గురి చేసింది. ఈ మాత్రం దానికే ప్రసాద్ అంత పని చెయ్యడం షాక్ కి గురి చేసింది. పిల్లలు చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులు మందలించారనో, టీచర్ తిట్టాడనో, మార్కులు తక్కువ వచ్చాయనో, ఫెయిల్ అయ్యామనో మనస్తాపంతో బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇది మంచి పరిణామం కాదంటున్నారు నిపుణులు. పిల్లల్లో ఇలాంటి పోకడ రావడం ప్రమాదకరం అంటున్నారు.

5ఏళ్ల కొడుకును చంపేసి తల్లిపై ఏడుగురు అత్యాచారం..ఇద్దరినీ తాడు కట్టేసి నీళ్లలో పడేసారు..


తల్లిదండ్రులదే బాధ్యత:
తల్లిదండ్రులు పిల్లలపై నిత్యం దృష్టి పెట్టాలని చెబుతున్నారు. ఒకేసారి వారిని మందలించడమో, తిట్టడమో కాకుండా మెల్ల మెల్లగా వారిలో మార్పు తేవాలని సూచిస్తున్నారు. మొదటి నుంచి పిల్లలపై శ్రద్ధ పెడితే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవని అంటున్నారు. పిల్లలు అడిగిన వెంటనే మొబైల్ ఫోన్లు కొనివ్వడం, ఆ తర్వాత వారు ఆన్ లైన్ గేమ్స్ కు బానిసలుగా మారడం, ఆ తర్వాత తల్లిదండ్రులు బాధపడటం.. ఇలాంటివి జరక్కుండా ఉండాలంటే పేరెంట్స్ ముందు నుంచి కూడా కేర్ ఫుల్ గా ఉండటం మంచిది అంటున్నారు నిపుణులు.సరదా కోసం స్మార్ట్‌ఫోన్‌ కొనిస్తే.. అవే విద్యార్థుల పాలిట మృత్యు పాశాలుగా మారుతున్నాయి. స్మార్ట్‌ఫోన్లలో గేమ్స్‌కు బానిసలైన స్టూడెంట్స్‌.. చిన్న కారణాలతోనే ప్రాణాలు తీసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకే మనస్తాపం చెందుతూ.. తల్లిదండ్రులు మందలించారనే కోపంతో ఉసురు తీసుకుంటున్నారు. ఆన్‌లైన్ గేమ్స్‌కు అడిక్ట్‌ అవడంతో.. వీడియో గేమ్స్ విద్యార్థుల పాలిట డెత్‌ గేమ్స్‌గా మారుతున్నాయి. ఆఖరి మజిలీలో ఆసరాగా నిలుస్తారనుకుంటే.. మధ్యలోనే ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు తీరని దుఖాఃన్ని మిగులుస్తున్నారు.