Sonia calls meet of all non-BJP allies on May 23

మద్దతు కోరుతూ కాంగ్రెస్ లేఖలు : స్పందించని టీఆర్ఎస్, వైసీపీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మే 23వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల హవా గట్టిగా ఉంటుందని ముందస్తు సర్వేలు చెబుతున్నాయి.

సార్వత్రిక ఎన్నికలు మే 19వ తేదీతో మగియనున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగిసిన తర్వాత నాలుగు రోజులకు అంటే మే 23వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల హవా గట్టిగా ఉంటుందని ముందస్తు సర్వేలు చెబుతున్నాయి.

బీజేపీ – కాంగ్రెస్ పార్టీలకు పూర్తి మెజార్టీ కష్టం అని చెబుతున్నారు విశ్లేషకులు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ముందస్తుగానే మేల్కొన్నది. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలకు లేఖలు రాసింది. 23వ తేదీ సోనియా అధ్యక్షతన జరిగే కాంగ్రెస్ మీటింగ్ కు రావాలని లేఖలు రాసింది. ఫలితాల వెల్లడి దగ్గర పడటంతో సోనియా గాంధీ కూడా యాక్టివ్ అయ్యారు.

బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటు చేయాలని గట్టిగా ఉన్న సోనియా.. ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మే 23వ తేదీన ప్రాంతీయపార్టీలతో సమావేశం నిర్వహించేందుకు సోనియాగాంధీ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ భేటీకి ఎన్డీయేతర పక్షాలను సోనియా ఆహ్వానించగా.. బీజేడీ, వైసీపీ, టీఆర్ఎస్, టీడీపీకి కూడా సోనియా గాంధీ ఆహ్వానం పంపారనే ప్రచారం జరుగుతోంది. 

ఫలితాలు వచ్చిన వెంటనే తటస్థ పార్టీలను యూపీఏలోకి తెచ్చి తద్వారా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది ఆమె ఆలోచన. అయితే అదే రోజు ఫలితాలు విడుదలవుతున్న క్రమంలోనే.. ఈ భేటీపై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఫలితాల ప్రకటన రోజు స్థానికంగా లేకుండా ఢిల్లీకి ఎలా వెళతారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

సోనియా గాంధీ లేఖలపై టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు స్పందించలేదు. లేఖలు వచ్చిన విషయాన్ని కూడా ధృవీకరించటం లేదు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. ముందస్తుగా కాంగ్రెస్ మేల్కొనటంతో.. పొలిటికల్ హీట్ పెరిగింది.

Related Posts