Home » ఆస్తి పంచుకున్నారు..అమ్మను నడి రోడ్డుపై వదిలేశారు
Published
6 months agoon
By
bheemrajతల్లి భారమై పోయింది.. ఆమె ఇచ్చిన ఆస్తి ముద్దు అయిపోయింది. నవ మాసాలు మోసి కని పెంచిన తల్లినే కొడుకులు రోడ్డుపై వదిలి వేశారు. పక్షవాతంతో బాధపడుతున్న కన్నతల్లిని ఇంట్లో నుంచి గెంటేశారు. ఈ అమానవీయ ఘటన హైదరాబాద్ అంబర్ పేటలో చోటు చేసుకుంది.
అంబర్ పేట డివిజన్ గోల్నాకలోని నివాసముంటున్న కమలమ్మకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. అందరూ పెళ్లిళ్లు చేసుకుని కుటుంబంతో ఉన్నారు.
ఇటీవల కమలమ్మ భర్త సత్యానారయణ చనిపోవడంతో అతని పేరు మీద ఉన్న ఆస్తి అంతా కుమారులకు సమానంగా పంచింది.
అయితే ఆస్తి తీసుకున్న కుమారులు తల్లిని పోషించడానికి ముందుకు రాలేదు. తమ ఇంట్లో ఉండొద్దంటూ బయటకు గెంటేశారు. కన్నతల్లిని కుమారులే రోడ్డు మీద వదిలేయడంతో కమలమ్మ కన్నీరుమున్నీరవుతోంది. గతంలోనూ పట్టించుకోవడం లేదని కమలమ్మ కోర్టుకెళ్లింది.
ఇటీవలే కమలమ్మ భర్త సత్యనారాయణ చనిపోయారు. ఈ నేపథ్యంలో తల్లిని ఒక్కో కొడుకు దగ్గర మూడు నెలలపాటు ఉండేటట్లుగా వారందరూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో తల్లి కోసం కేటాయించిన ఇళ్లును కూడా కుమారులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే కోవిడ్ సాకుగా చూపి ఆ తల్లిని బయటకు పంపేశారు. బయటకు గెంటివేయడంతో వృద్ధురాలు కన్నీరుమున్నీరవుతోంది. ఇటీవలే ఆమెకు పక్షవాతం వచ్చింది. ఈ నేపథ్యంలో కన్నతల్లిని బయటికి పంపడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కుమారులను పిలిపించి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. తనకు కేటాయించిన ఇంట్లోనే తను ఉండేలా చూడాలని కోరుతోంది. తమ కుమారులు ఎవ్వరూ బాగోగులు చూసుకోవడం లేదు.. కాబట్టి పోలీసులు, ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని కోరింది.