లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

నా భార్య తెలుగమ్మాయే..

Published

on

Sonu Sood: సోనూ సూద్.. ఈ లాక్‌డౌన్ సమయంలో ఎందరికో సాయమందించి రియల్ హీరో అనిపించుకున్నారు. కొంత విరామం తర్వాత తిరిగి షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేష్, అను ఇమ్మానుయేల్ హీరో హీరోయిన్లుగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల్లుడు అదుర్స్’ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Alludu Adhurs

సోనూ సూద్ ఈ సినిమాలో ‘గజా’ అనే ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ‘అల్లుడు అదుర్స్’ సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా సోనూ సూద్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తెలుగు సినీ పరిశ్రమ గురించి మాట్లాడారు.

Sonu Sood

‘‘నేను ఏ చిత్ర పరిశ్రమలో ఉన్నా తెలుగు పరిశ్రమని ఎప్పుడూ ప్రేమిస్తాను.. తెలుగు నుంచి సినిమా గురించి చాలా నేర్చుకున్నాను.. నా భార్య తెలుగమ్మాయే.. నేను తెలుగు కుటుంబంలో ఒకడినే.. ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్స్.. బెల్లంకొండ సురేష్ గారు ఎప్పుడు సినిమా చేయమన్నా కథ కూడా వినకుండా సినిమా చేస్తాను.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచి పర్సన్.. కష్టపడే వ్యక్తితం తనది.. ఇప్పుడు బాలీవుడ్‌కి వెళ్తున్నాడు.. అక్కడ కూడా తను మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.