లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

సోనూ సూద్ పేరుతో అంబులెన్స్ సర్వీస్!

Published

on

Sonu Sood Ambulance Service: రియల్ హీరో, హెల్పింగ్ హ్యాండ్ సోనూ సూద్ లాక్‌డౌన్ సమయంలో చేసిన పలు సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇప్పటికీ ఆపదలో ఉన్నవారికి తనకు తోచిన సాయం చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. మరోపక్క ఆయన నుండి సాయం పొందిన వారు సోనూని దేవుడిలా ఆరాధిస్తున్నారు. సోనూ సూద్ చేసిన సేవలకు గుర్తింపుగా, ఆయన మంచి మనసును అభినందించని వారంటూ ఎవరూ లేరు..

Sonu Sood Ambulance Service

తాజాగా హైదరాబాద్‌‌కు చెందిన ట్యాంక్ బండ్‌ శివ అనే వ్యక్తి సోనూ సూద్‌ అంబులెన్స్‌ సర్వీస్‌ పేరుతో అంబులెన్స్ సేవలను ప్రారంభించాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వైద్య సదుపాయం అందుబాటులో లేని మారుమూల ప్రాంతాలకు ఈ అంబులెన్స్‌ సర్వీసుతో ప్రజలకు సేవలు అందిస్తారు. మంగళవారం సోనూ సూద్ ఈ అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ప్రభుత్వ అంబులెన్స్‌ల మాదిరిగానే ఆపదలో ఉన్నవారికి ఇకనుండి సోనూ సూద్ అంబులెన్స్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి.

Sonu Sood Ambulance Service