హెల్పింగ్ హ్యాండ్ సోనూ సూద్.. చప్పట్లతో స్వాగతం, సెట్లో సన్మానం.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Helping Hand Sonu Sood:

చప్పట్లతో స్వాగతం.. సెట్లో సన్మానం..
జాతీయస్థాయిలో వేలాది మంది వలస కూలీలను ఆదుకున్న ప్రముఖ స్వచ్ఛంద సేవకుడు, సినీ నటుడు తెరమీద విలన్.. తెర వెనుక హీరో.. హెల్పింగ్ హ్యాండ్ సోనూ సూద్‌ను విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌ షూటింగ్‌ లొకేషన్‌లో సత్కరించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా సంతోష్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కతోన్న చిత్రం ‘అల్లుడు అదుర్స్‌’ చిత్రంలో సోనూ సూద్‌ కీలక పాత్రలోనటిస్తున్నారు.

కోవిడ్‌ సమయంలో కొన్ని వేల మంది ప్రజలకు సాయం చేసిన సోనూ సూద్‌‌ను అభినందిస్తూ ప్రకాష్ రాజ్‌ ప్రత్యేకంగా సత్కరించారు. యూనిట్ సభ్యులు సోనూ సూద్‌కు చప్పట్లతో ఘన స్వాగతం పలికారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్..
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు సోనూ సూద్. ఈ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు శ్రీను వైట్ల విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించి రామోజీ ఫిలిం సిటీలో మొక్కలు నాటారాయన.

కరోనా, తదనంతర కాలంలో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత పెరిగింది. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో నేను ఒకరిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉంది, ఇదే స్ఫూర్తితో లక్షలాదిమంది ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ మొక్కలు నాటి, పర్యావరణాన్ని పరిరక్షించాలని సోనూ సూద్ పిలుపునిచ్చారు.

Sonu Sood

బ్రాండ్ అంబాసిడర్..
సోనూ సూద్‌ను ప్రముఖ లాప్‌టాప్‌ కంపెనీ ఏసర్‌ ఇండియా తమ కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. సోనూసూద్‌ వంటి మానవతావాది తమ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ కావడం ఎంతో ఆనందంగా ఉందని, లాప్‌టాప్‌లకు సంబంధించిన కొత్త టెక్నాలజీని వినియోగదారులకు వివరించడంలో సోనూ బ్రాండింగ్‌ తమకు ఉపయోగపడుతుందని ఏసర్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు.Related Posts