శభాష్ సోను భాయ్.. దుర్గమాత ఉత్సవాల్లో విగ్రహం!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Sonu Sood Statue at Durga Puja Pandal:
కరోనా కష్టకాలంలో తనవంతు బాధ్యతగా ఎంతోమందికి ఎన్నో రకాలుగా సేవ చేసి రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్ కు ప్రత్యేక గౌరవం లభించింది. నిజ జీవితంలో హీరో అనిపించుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచిన సోనూ సూద్‌పై ప్రేమను కోల్‌కత్తాలో దుర్గామాత మండపాల వద్ద ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసి తమ ప్రేమను చాటుకుంటున్నారు నిర్వాహకులు. ఇప్పుడు ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.
వినాయక చవితి, దుర్గాష్టమి వేడుకల్లో ట్రెండ్‌కు తగినట్లు వివిధ రకాలుగా విగ్రహాలు చేయడం చూశాం. ఇప్పుడు దుర్గాష్టమి సందర్భంగా చాలా మంది దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. అయిత కోల్‌కత్తాలో దుర్గా మాత మండపాల వద్ద నిర్వాహకులు సోనూసూద్‌ విగ్రహాలను ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Hyderabad Floods: సంపూర్ణేష్ బాబు విరాళం..


సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న సోను.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. నేను ఈ మండపాన్ని దర్శించవచ్చా అని అడిగారు.. అక్కడి వారు తనపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలియచేశారాయన.Related Tags :

Related Posts :