లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ఏనుగు మలంతో మద్యం..! ఒక్కసారి తాగితే ‘వన్స్ మోర్’ అంటారట..!!

Published

on

South Africa : Elephant Dung Gin ‘Indlovu’ : ఏనుగు మలంతో (పేడ)తో తయారు చేసిన మద్యం మీరెప్పుడన్నా తాగారా? పోనీ కనీసం విన్నారా? అంటే లేదనే చెబుతారు. కానీ ఏనుగు పేడతో తయారు చేసే మద్యానికి మంచి డిమాండ్ ఉందని తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.

‘ఏనుగు పేడతో మద్యమా..ఛీ ఛీ యాక్..అని వెగటుగా మాట్లాడాల్సి పనిలేదు..ఎందుకంటే ఈ మద్యం చాలా చాలా రుచిగా ఉంటుందట..ఒక్కసారి తాగితే ‘ఒన్స్ మోర్’అంటారట..అంత టేస్టు ఉంటుందట. దక్షిణాఫ్రికాలో ఏనుగు పేడతో తయారు చేసే మద్యానికి యమా డిమాండ్ ఉంది. ఇదంటే నాలుక కోసేసుకుంటారట మద్యం ప్రియులు. దక్షిణాఫ్రికాలో ఎక్కువగా అమ్ముడుపోయే ‘ఇండ్లోవు’ (Indlovu) అనే జిన్‌ అంటే మద్యం ప్రియులు పడి చచ్చిపోతారట..ఏనుగు పేడతో చేసే మద్యం గురించి తెలుసుకుంటే మాత్రం ఓ చుక్కేసేద్దామని అనుకోకుండా ఉండరట మందుబాబులు..ఏనుగు శాఖాహారి..ఆకులు అలములు తింటుంటుంది. అది తినే ఆహారం ద్వారా దాని మలంలో ఉండే ప్రత్యేకత గురించి తెలిస్తే ఈ మద్యం తాగేందుకు ఏమాత్రం వెనుకాడటరట..మరి ఏనుగు మలంతో జిన్ ఎలా తయారు చేస్తారో ఆ విశేషాలేంటో..

దక్షిణాఫ్రికాలో ఎక్కువగా అమ్ముడుపోయే ‘ఇండ్లోవు’ (Indlovu) అనే జిన్‌ అంటే మద్యం ప్రియులు చాలా చాలా ఇష్టపడతారు. అక్కడి స్థానిక భాషలో ‘ఇండ్లోవు’ అంటే ఏనుగు అని అర్థం. ప్రిమియం స్పిరిట్‌లలో ఒకటైన ఈ జిన్ తయారీకి ఏనుగు మలం ఉపయోగించడం వల్ల.. ఆ బ్రాండ్‌కు ఆ పేరు పెట్టారన్నమాట. దీని తయారీ అంత ఈజీకాదట. ఏనుగు పేడతో తయారు చేసే మద్యం వెనుక ఇద్దరు ప్రొఫెసర్లు చేసిన కృషి అంతా ఇంతా కాదు.

Elephant Dung Gin

పౌలా, లెస్ అన్‌స్లేస్ అనే బయోలజీ మాజీ ప్రొఫెసర్లు రిటైర్ అయిన తరువాత యూకే నుంచి దక్షిణాఫ్రికాకు వెళ్లారు. అక్కడ స్థానికుల అవసరాలను తీర్చేందుకు ఏదైనా సరికొత్త ప్రాజెక్ట్ కనిపెట్టి తయారు చేయాలని అనుకున్నాడు. కానీ వారికి ఏనుగు మలంతో మద్యం తయారుచేయాలనే ఆలోచన కూడా లేదు. కానీ అదే చేస్తారని..వారి ఏమాత్రం ఊహించనది జరుగుతుందని వాళ్లు ఏమాత్రం ఊహించలేదు. అదే తమ ప్లాన్‌లో అత్యంత కీలకంగా మారుతుందని వారు అస్సలు ఊహించలేదట. కానీ అనుకోనిది జరిగితేనే కదా కిక్కు..మరి వారి ఆలోచనలో లేనిది ఈ మద్యం యోచనకు నాంది ఎక్కడ పడిదంటే..

కొన్నాళ్ల క్రితం ఈ ఇద్దరు ప్రొఫెసర్లలో ఒకరైన లెస్ అన్‌స్లేస్‌కు ఈ ఆలోచన కలిగింది. ఓసారి దక్షిణాఫ్రికాలోని యానిమల్ రిజర్వ్‌ను చూడటానికి వెళ్లారు. అక్కడ ఏనుగులను సంరక్షించే ఓ వ్యక్తి.. వాటి ఆహారం గురించి అన్‌స్లేస్‌కు వివరంగా చెప్పాడు. ఏనుగులు తినే ఆహారం విషయంలో చాలా కచ్చితంగా ఉంటాయని..అవి తినే ఆహారంలో సగం కంటే తక్కువ మేతను మాత్రమే శరీరానికి తీసుకుంటాయని, మిగతా సగం చెక్కుచెదరకుండా మలం ద్వారా బయటకు వచ్చేస్తుందని చెప్పుకొచ్చాడు. ఓ ఏనుగును సంరక్షుడు ఇన్ని వివరాలు చెబుతుంటే విన్న అన్ స్లేస్ ఆశ్చర్యపోయారు. ఏనుగు గురించి అతను చెబుతుంటే ఎంతో శ్రద్ధగా విన్నాడు.

అలా ఆలోచిస్తున్న అన్‌స్లేస్‌కు ఓ ఐడియా వచ్చింది. ఏనుగుల మలాన్ని సరికొత్త జిన్‌లో సహజ పదార్థంగా ఎందుకు ఉపయోగించకూడదని అనుకున్నారు. కానీ..అది ఎంత వరకూ కరెక్ట్ అనే ఆలోచన కూడా వచ్చింది. ఇది పెద్ద విషయంగా అనిపించలేదు.దీంతో ఆ దిశగా ఎటువంటి యత్నం చేయలేదు. అన్‌స్లేస్, పౌలాకు డిస్టిల్లింగ్‌లో పెద్దగా అనుభవం లేదు. కానీ.. దక్షిణాఫ్రికాలో ఏనుగుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఏనుగు మలానికి కూడా ఎటువంటి కొరత ఉండదనే విషయాన్ని గుర్తించారు. దీంతో ఏనుగు మలం సేకరించి ‘జిన్’ తయారీకి కంకణం కట్టుకున్నారు. అలా 2018లో ‘ఇండ్లోవు’ జిన్‌ తయారీకి శ్రీకారం చుట్టారు అన్‌స్లేస్, పౌలాలు.

దాని కోసం వెస్ట్రన్ కేప్‌లో గల గేమ్ రిజర్వ్‌ అధికారులను సంప్రదించారు. తమకు ఏనుగు పెంట (మలం) కావాలని..దాన్ని మాకు పంపిచాలని కోరారు. ఇందుకు వారుకూడా అంగీకరించటంతో వారి మొదటియత్నం ఫలించింది. అలా సేకరించిన ఏనుగు మలాన్ని బాగా ఎండబెట్టారు. అనంతరం దాన్ని స్టెరిలైజ్ (క్రిమిరహితం) చేశారు. అనంతరం దాన్ని మళ్లీ కడిగి ఆరబెట్టారు. చివరి దశలో భాగంగా దాన్ని కొన్ని ప్రక్రియలద్వారా జిన్‌గా మార్చారు.

కాగా ఏనుగు శాఖాహారి అనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అనేకరకాల మొక్కలు, చెట్ల ఆకుల్ని తీసుకుంటుంది. అంతేకాదు పలు రకాల వేర్లు, గడ్డి, పండ్లు, బెరడులు, కలబంద, అకాసియా వంటి ఎన్నో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటుంది. అలా తిన్న ఆ ఆహారం మొత్తాన్ని పూర్తిగా జీర్ణించుకోకుండా పోషకాలన్నీ మలం ద్వారా బయటకు వదిలేస్తుంది. అందుకే ఆ జిన్‌ అంత రుచిగా ఉంటుందని అన్‌స్లేస్ తెలిపాడు.

ఏనుగు మలంతో జిన్ తయారు చేసే ఈ ప్రాజెక్ట్ 2018లో ప్రారంభమైంది. మొదటి ఏనుగు మలం జిన్ బాటిల్ ఉత్పత్తి మొదలైంది మాత్రం 2019 నవంబరులో. మొదటిసారి ఈ జిన్ గురించి పెద్దగా స్పందన రాలేదు. మిశ్రమంగా వచ్చింది. కొందరికి నచ్చింది మరికొందరికి నచ్చలేదు.

కానీ.ఆఫ్రికా, యూరప్ దేశాల్లో మాద్రం దీని రుచి భలే ఉందన్నారు. వాళ్లకు ఈ టేస్ట్ నచ్చటంతో ఏనుగు పేడ మద్యం తయారీ ఉపందుకుంది. దీంతో తయారీదారులకు మాంచి లాభాలు గిడుతున్నాయి. అలా వచ్చిన ఆదాయంలో 15 శాతం మొత్తాన్ని ఏనుగుల సంరక్షణ కోసం ఆఫ్రికా ఫౌండేషన్‌కు అందిస్తున్నారు.