లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-2

పిల్లల్ని కనటానికి వచ్చి..వేలకొద్దీ సీల్స్‌ మృతి..!!

Published

on

South Africa : సౌత్‌ ఆఫ్రికాలోని ఓ బీచ్ లో గర్భంతో ఉన్న సీల్స్ మరణం షాక్ కు గురిచేస్తోంది. గర్భంతో ఉన్న వేలకొద్దీ చనిపోయి పడి ఉండటంతో ప్రాంతమంతా సీల్స్ కళేబరాలతో సముద్రం ఘోష సీల్స్ మరణఘోషలా వినిపిస్తోంది. నిండు గర్భంతో ఉన్న వేలకొద్దీ సీల్స్ పిల్లలకు జన్మినివ్వకుండానే ప్రాణాలు కోల్పోయాయి.


ఎన్నో సీల్స్ పిల్లలు ఈ లోకం చూడకుండానే..సాగర నీటి తడి సోకకుండానే మృతి చెందటం విషాదకర ఘటనగా మారింది. ప్రపంచంలోని అతిపెద్ద సీల్ కాలనీలలో ఒకటైన ఈ బీచ్ లో సీల్స్ వేలకొద్దీ అసాధారణ మరణాల ఘటన శాస్త్రవేత్తలలో తీవ్ర ఆందోళన కలిగించింది. నమీబియాలోని వాల్విస్‌ బే నగరం.. పెలికాన్‌ పాయింట్‌లో ఉన్న బీచ్‌ వద్ద ఓ సీల్‌ బ్రీడింగ్ కాలనీ ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద సీల్ కాలనీ.


ఈ ప్రాంతానికి ప్రతీ సంవత్సరం సీల్స్ వేలసంఖ్యలో గర్భంతో ఉన్న సీల్స్‌ వచ్చి పిల్లలకు జన్మనిస్తాయి. అలా గర్భంతో ఉన్న సీల్స్ పిల్లలకు జన్మనివ్వటానికి కొన్ని రోజుల క్రితం వేలకొద్దీ గర్భంతో ఉన్న ఆడ సీల్స్‌ ఇక్కడకు వచ్చాయి. బీచ్‌ వచ్చిన తరువాత అవన్నీ చనిపోయాయి. మృతి చెందిన సీల్స్‌ దాదాపు 7వేల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.


సముద్ర పరిరక్షణకు చెందిన నౌడ్ డ్రేయర్ ఈ సీల్స్‌ మృతదేహాలను సెప్టెంబర్‌లో గుర్తించారు. ఆ తరువాత అక్టోబర్ తొలి రెండు వారాల్లో పెద్ద సంఖ్యలో సీల్ పిండాలను చూసామని నమీబియా డాల్ఫిన్ ప్రాజెక్టుకు చెందిన డాక్టర్ టెస్ గ్రిడ్లీ తెలిపారు.


సీల్స్ నవంబర్-డిసెంబర్ మధ్యకాలంలో పిల్లలకు జన్మనిస్తాయని చెప్పారు. అయితే వేల కొద్దీ ఆడ సీల్స్ పిల్లలను కనేందుకు బీచ్ వద్దకు వచ్చి ఇలా మరణించటం దురదృష్టకర ఘటన అని గ్రిడ్లీ అన్నారు. ఇలా పెద్ద సంఖ్యలో గర్భంతో ఉన్న ఆడ సీల్స్ చనిపోవడం వెనుక కారణం ఏమిటన్నది తెలియడం లేదని..దీనికి సంబంధించి కారణాలు తెలుసుకునేందుకు పరిశోధిస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు.


కాలుష్యం వల్లా చనిపోయాయా? లేదా ఆహారలేమి వల్లనా..లేదా ఏదన్నా వైరస్ సోకి చనిపోయాయా? అనే కోణంలో పరీక్షలు చేస్తున్నారు. అయితే ఆ సముద్ర తీరంలో తగిన సంఖ్యలో చేపలు లేక ఆహారం కొరత వల్లనే సీల్స్ మరణించి ఉంటాయని నమీబియా మత్స్యశాఖ మంత్రి చెప్పడం విశేషం.


కానీ ఆ కారణం అయి ఉండకపోవచ్చనే అనుమానాలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. నమీబియా మత్స్య శాఖ చెప్పిన ఈ కారణం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరణించిన సీల్స్‌కు పరీక్ష అనంతరం దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *