తుపాకీ పట్టిన మహిళా గవర్నర్..కనిపించిన పక్షుల్ని కాల్చి పడేస్తోంది

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఓ మహిళా గవర్నర్ తుపాకీ పట్టుకుని వేటకు బయలుదేరారు. కంటికి కనిపించిన పిట్టల్ని ఇష్టమొచ్చినట్లుగా కాల్చిపడేస్తోంది. ఆమెపై పక్షి ప్రేమికులు మండిపడుతున్నారు. సదరు మహిళా గవర్నర్ వేటగాడిలో పొడవాటి తుపాకీ పట్టుకుని పిట్టల్ని కాల్చిపడేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


అమెరికాలోని సౌత్ డకోటా రాష్ట్ర గవర్నర్‌ క్రిస్టీ నోయెమ్‌ పక్షులను వేటాడుతున్నారు. నెత్తిన టోపీ, కళ్ళకు అద్దాలు పెట్టుకుని..చేతిలో పొడవాటి తుపాకీ పట్టుకుని మొక్క జొన్న చేనులో కలియతిరుగుతున్నారు. ఆ చేనులోకి వస్తున్న పక్షులు తుపాకీతో కాల్చి పడేస్తున్నారు. ఈ దృశ్యాలను ఆమె కెమెరాలో బంధించి ట్విట్టర్‌లో షేర్ చేశారు.


‘సౌత్ డకోటా రాష్ట్రంలో మేము ఈ విధంగా సామాజిక దూరాన్ని పాటిస్తున్నాము’ అంటూ ఆ వీడియోకి క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ వీడియోపై జంతు ప్రేమికులు, కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


కొందరు తుంటరి నెటిజన్లు మాత్రం..ఈ వీడియోలో లేడీ గవర్నర్ సో క్యూట్ గా ఉన్నారంటుంటే మరికొందరు చాలా అందంగా ఉన్నారు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడుగేస్తున్నారు. ఆమెకుగానీ మండిందంటే తుపాకీతో మిమ్మల్ని కూడా కాల్చిపడేస్తుంది జాగ్రత్త అని కౌంటర్లు కూడా ఇస్తున్నారు.

Related Posts