కరోనా భయం :వాషింగ్ మిషన్ లో కరెన్సీ నోట్లు వేసి ఉతికేశాడు..తరువాత ఓవెన్ లోపెట్టి..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ పేరు చెబితేనే హడలిపోతున్నప్రజలు తీసుకునే జాగ్రత్తలు అన్నీ ఇన్నీ కావు. ఎవరికి తోచినట్లుగా వారు చేసేస్తున్నారు. ఈ జాగ్రత్తలు శృతి మించి సందర్భాలు కూడా లేకపోలేదు. ఆకుకూరలను కూడా బట్టలకు బ్రష్ పెట్టినట్లు తోమిపారేస్తున్నారు. అలాగే బైటనుంచి వచ్చిన వస్తువులు..సరుకుల విషయంలో తీసుకునే జాగ్రత్తలు వింటున్నా..చూస్తున్నా కొన్ని ఫన్నీగా ఉంటే..మరికొన్ని ఇదేం ఛాదస్తంరా బాబూ అన్నట్లుగా ఉంటున్నాయి.కరెన్సీ నోట్ల ద్వారా కూడా కరోనా వస్తుందని ప్రచారం సాగడంతో కొందరు వాటిని నీటిలో కడిగి ఆరబెడుతున్నారు. కానీ ఓ ప్రబుద్ధుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా వాషింగ్ మెషిన్లోనే కరెన్సీ నోట్లను వేసి శుభ్రం చేసేద్దామనుకుని మిషన్ లో వేసేశాడు. తరువాత ఇంక చెప్పేదేముంది??అందరూ అనుకున్నట్లుగానే జరిగింది. దీంతో అతగాడు కుయ్యోమెర్రో మంటూ గోల గోల చేశాడు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌‌కు చెందిన

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌‌కు సమీపంలో ఉన్న అన్సాన్ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల చనిపోయాడు. కరోనా మహమ్మారి కాలం కావడంతో బంధుమిత్రులు అందరూ కలిసి ఆ కుటుంబానికి 42 డాలర్ల( రూ.50వేలు) సాయం చేశారు. అయితే ఆ నోట్లకు కరోనా వైరస్ అంటుకుని ఉంటుందేమోనన్న అనుమానంతో అతను వాటిని మొదట కడిగేయాలనుకున్నాడు. కానీ కడిగేటప్పుడు వాటిమీద కరోనా వైరస్ ఉంటే అది నాకు అంటుకుంటుందేమోననే భయంతో ఏకంగా ఆనోట్లను వాషింగ్ మిషన్ లో వేసి సర్ఫ్ వేసి మరీ రెండు మూడు రౌండ్లు తిప్పి డోర్ తెరిచాడు.తరువాత ఇంకేముంది నోట్లు ముద్దలుగా మారిపోయాయి. అక్కడితో ఊరుకున్నాడా అంటే లేదు. ముద్దగా మారిపోయిన నోట్లను తీసి మైక్రోవేవ్ లు వేశాడు. దీంతో నోట్లు ఆరాయి. ఎలాగంటే చాలావరకూ చినిగిపోయి..రంద్రాలు పడిపోయాయి. వాటిని ఎవరూ తీసుకోరని పాపం గురుడికి అర్థమైంది. దీంతో బ్యాంకుకు వెళ్లి అసలు విషయం చెప్పాడు.కానీ బ్యాంకువాళ్లు కూడా తీసుకోమని చెప్పేసరికి తెల్లముఖం వేశాడు. కానీ..పాపం కనికరం చూపించండి సార్..అంటూ కాళ్లావేళ్లా పడగా నంబర్లు చెరిగిపోని వాటిని మాత్రం తీసుకుని రూ. 1500 చేతిలో పెట్టి పంపారు. దీంతో చేసేదేమీ లేక వాటితోనే ఇంటికొచ్చాడు. ఇటువంటి ఛాదస్తాలతో మొదటికే మోసం తెచ్చుకుంటుననారు చాలామంది.

Related Posts